Colors swathi reddy singing another song in tamil movie with simbu

colors swathi reddy, swathi reddy stills, swathi photos, swathi songs, swathi news, swathi latest updates, swathi movie updates, swathi tamil song, swathi gossips, swathi with simbu, swathi gallery, swathi photo shoot, swathi thaman news

colors swathi reddy singing another song in tamil movie with simbu : Colors swathi reddy is singing in tamil movie appa takkar with hero simbu which is composing by ss thaman.

మరోసారి గొంతు సవరించుకుంటున్న స్వాతి

Posted: 03/23/2015 11:24 AM IST
Colors swathi reddy singing another song in tamil movie with simbu

యాంకర్ గా కెరీర్ ప్రారభించిన కలర్స్ స్వాతి.. ఆ తర్వాత చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కన్నా తమిళ, మలయాళ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేస్తున్న స్వాతిలో సింగింగ్ టాలెంట్ కూడా వుందన్న విషయం తెలిసిందే! గతంలో ‘100% లవ్’ చిత్రంలో ఈమె పాడిన ‘ఏ స్క్వేర్ బీ స్క్వేర్’ పాట మంచి పాపులర్ అయింది కూడా! ఇప్పుడు మరోసారి ఈ భామ తన గొంతును సవరించుకునే పనిలో పడిందని సమాచారం!

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ కు టాలీవుడ్ తోపాటు కోలీవుడ్ లోనూ మంచి క్రేజుంది. ఈ నేపథ్యంలోనే ఇతనికి అక్కడి నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తమిళంలో ఓ సినిమాకు ఇతగాడు ట్యూన్స్ అందిస్తున్నాడు. ఇంకొక విషయం ఏమిటంటే.. ఇతను పాటలందించే ప్రతి సినిమాలోని ఒక పాటను ఆ మూవీకి సంబంధించి హీరోహీరోయిన్లతోగానీ లేదా ఇతర సెలబ్రిటీలతోగానీ పాడిస్తుంటాడు. ఇప్పుడు తాను పాటలందిస్తున్న తమిళ చిత్రంలోని ఓ పాటను స్వాతితో పాడించాలని భావించాడు. ఈ విషయమై ఆమెతో చర్చించగా.. తాను పాడేందుకు సిద్ధమని స్వాతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం!

తమన్ సంగీతం సమకూరుస్తున్న ‘అప్పా టక్కర్’ అనే సినిమాలో స్వాతి ఓ పాట పాడనుంది. అది కూడా హీరో శింబుతో కలిసి ఓ మసాలా సాంగు పాడనుంది. ఈ పాటను త్వరలోనే రికార్డు చేయనున్నట్లు ఆ మూవీ యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles