Asin thottumkal got tamil movie offer with hero madhavan

asin thottumkal news, asin thottumkal movies, asin gossips, asin photos, asin hot photo shoot, asin news, asin tamil movies, asin bollywood movies, asin scandals, asin love affairs, asin affairs, asin marriage news, asin gallery, asin madhavan, madhavan news, hero madhavan movies

Asin Thottumkal got tamil movie offer with hero madhavan : After a long time the mallu beauty asin thottumkal got a tamil movie offer in which hero madhavan in lead role.

బాలీవుడ్ లో ఆఫర్లు కరువై.. మళ్లీ దక్షిణాదికి!

Posted: 03/16/2015 10:23 AM IST
Asin thottumkal got tamil movie offer with hero madhavan

‘అమ్మానాన్న ఓ తమిళమ్మాయి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన మల్లూబేబీ ఆసిన్.. అనతికాలంలోనే దక్షిణాది పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. వరుస విజయాలతో అందరీ హీరోయిన్లను వెనక్కు వేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. దీంతో ఈమెకు అటు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు రావడం మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలోనే అమీర్ ఖాన్ సరసన ‘గజనీ’ సినిమాలో నటించే ఆఫర్ దక్కించుకుంది. అది బ్లాక్ బస్టర్ అవడంతో అక్కడ ఆఫర్లు వెల్లువ కురిసింది. దీంతో ఈ అమ్మడు ఇటు దక్షిణాది పరిశ్రమను మరిచిపోయి.. అక్కడే సినిమాలు చేసుకుంటూ కాలం గడిపింది. అక్కడ ఈమె నటించిన సినిమాలన్నీ 100 కోట్ల క్లబ్బులో చేరినవే! అయితే.. కాలక్రమంలో కొత్త హీరోయిన్ల హవా కొనసాగడంతో ఈమెకు ఒక్కసారిగా ఆఫర్లు పడిపోయాయి. కొన్నాళ్లవరకు అవకాశాల కోసం బాగానే ప్రయత్నాలు చేసింది. చివరికి తన అందాలను ఆరబోయడానికి కూడా సిద్ధమని అప్పట్లో ప్రకటించింది కూడా! కానీ.. ఫలితం లేకపోయింది. ఇక చేసేదేమీలేక.. మళ్లీ సౌత్ కి వచ్చేద్దామని గతకొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అమ్మడికి ఓ ఆఫర్ వరించింది.

మాధవన్ హీరోగా తమిళంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో కథానాయిక కోసం యూనిట్ బృందం ఎందరినో పరిశీలించింది. ఈ క్రమంలోనే ఆసిన్ ని అడగగా.. ఆమె వెంటనే ఒప్పేసుకుంది. పారితోషికం కూడా అడగకుండా ఈ సినిమా చేసేందుకు రెడీ అయిపోయిందని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఏదైతేనేం.. మొత్తానికి చాలాకాలం తరువాత ఈ మల్లూ భామ మళ్లీ సౌత్ సినిమాల్లో కనిపించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asin thottumkal  madhavan  tamil movies  kollywood gossips  

Other Articles