Aamir khan apologise pk movie boxoffice collections anushka sharma sanjay dutt

aamir khan, aamir khan latest news, aamir khan pk movie, pk movie news, pk movie controversy, pk controversy, pk boxoffice collections, aamir khan latest updates, anushka sharma news, anushka sharma galleries, anushka sharma affairs, anushka sharma controversies, sanjay dutt news, sanjay dutt controversies, sushant singh rajput news, raj kumar hirani

aamir khan apologise pk movie boxoffice collections anushka sharma sanjay dutt : bollywood mister perfectionist apologise to those people who hurted with pk movie.

క్షమాపణలు చెబుతున్న అమీర్ ఖాన్..

Posted: 03/12/2015 11:46 AM IST
Aamir khan apologise pk movie boxoffice collections anushka sharma sanjay dutt

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ గా పేరుగాంచిన అమీర్ ఖాన్.. సాధారణంగా వివాదాలకు దూరంగా వుంటాడు. అంతెందుకు.. ఇతగాడు కనీసం ఫంక్షన్లకు కూడా హాజరు కాడు. కేవలం తన వృత్తిపైనే ఎక్కువ దృష్టి సారిస్తాడు. ఇతనిపై ఎన్ని గాసిప్స్ వచ్చినా వాటిని పట్టించుకోడు. ఏ గొడవల్లోనూ తలదూర్చడు. అటువంటి హీరో.. ఏం తప్పు చేశాడో తెలియదు కానీ.. క్షమాపణలు చెప్పుకుంటున్నాడు.

ఇటీవలే అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ చిత్రం విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే! కేవలం 80 కోట్ల బడ్జెట్టుతో నిర్మించిన ఈ చిత్రం దాదాపు రూ.600 కోట్లకుపైగా కాసులవర్షాన్ని కురిపించింది. ఇందులో అమీర్ ఖాన్ గ్రహాంతరవాసిగా నటించిగా అనుష్క శర్మ హీరోయిన్ గా నటించింది. రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కీలకపాత్రల్లో నటించారు.

దొంగబాబాలు సృష్టించే అసత్య ప్రచారాలను నమ్మకూడదనే మెసేజ్ తో తెరకెక్కిన ఈ చిత్రం అన్నివర్గాల వారిని ఆకట్టుకోవడంతో ఇది బాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే ఇదే సమయంలో కొంతమంది నుంచి ఈ మూవీకి వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. తమ మనోభావాలు దెబ్బతినేలా ఈ మూవీలో కొన్ని సన్నివేశాలున్నాయని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అప్పట్లో కొన్ని వివాదాలు కూడా చెలరేగాయి. కానీ.. అప్పుడు ఏమీ స్పందించని అమీర్ ఖాన్.. ఇప్పుడు నోరు మెదిపాడు.

తన ‘పీకే’ చిత్రం వల్ల ఎవరైనా మనస్థాపం చెంది వుంటే తనను క్షమించాలని అమీర్ ఖాన్ కోరాడు. ఎవరి మతభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం తనకు, ఈ సినీ దర్శకనిర్మాతలకు లేదని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో అమీర్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం మెజారిటీ సంఖ్యలో ప్రేక్షకుల ద్వారా ప్రేమించబడింది. అయితే.. ఒక్క వ్యక్తినైనా ఇది బాధించి వుంటే వ్యక్తిగతంగా నేనూ బాధపడుతున్నాను. సినిమాలో మేము ఏదైనా చెప్పాలనుకున్నామో అది చాలా ముఖ్యమైన అంశం. అది ఒకవేళ ఎవరినైనా బాధపెట్టి వుంటే.. అందుకు నేను క్షమాపణ చెబుతున్నా’ అని స్పష్టం చేశాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamir khan  pk movie controversy  anushka sharma  sanjay dutt  

Other Articles