Allu arjun son of sathyamurthy movie extended pre look teaser

Son of Sathyamurthy Extended Pre Look, Son of Sathyamurthy Title Logo, Son of Sathyamurthy Pre First Look Poster, Son of Satyamurthy Audio Release Date, Son of Sathyamurthy movie news, Son of Sathyamurthy movie updates, Allu Arjun news, Allu Arjun Son of Sathyamurthy movie, Son of Sathyamurthy telugu movie, Allu Arjun Son of Sathyamurthy Satellite rights, Son of Sathyamurthy telugu movie news, Son of Sathyamurthy movie Satellite rights, Allu Arjun latest updates

Allu Arjun Son of Sathyamurthy Movie Extended Pre Look Teaser: Allu Arjun latest movie Son of Sathyamurthy. Title logo Released. Trivikram srinivas direction, Nithya menon, adah sharma, samantha heroines. devi sri prasad music.

సన్నాఫ్ సత్యమూర్తి ఫస్ట్ లుక్ టీజర్

Posted: 03/09/2015 10:19 AM IST
Allu arjun son of sathyamurthy movie extended pre look teaser

మహిళా దినోత్సవం సంధర్భంగా సన్నాఫ్ సత్యమూర్తి కాస్త ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇటీవలే హోళీ సంధర్భంగా ఈ చిత్ర ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ ఎక్స్ టెండెడ్ టీజర్ ను విడుదల చేసారు. త్వరలోనే పూర్తి ఫస్ట్ లుక్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా చేయనున్నట్లుగా తెలిసింది.

ఈ సినిమాలో బన్నీ సరసన నిత్యామీనన్, ఆదాశర్మ, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈనెల 15న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరుపనున్నారు.

కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహ, రాజేంద్రప్రసాద్, సింధు తులాని కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Son of Sathyamurthy  Extended Pre Look  Title Logo  

Other Articles