Tamanna bhatia liplock bikini scenes bahubali bengal tiger movies

tamanna bhatia, tamanna news, tamanna latest news, tamanna liplock news, tamanna bikini photos, tamanna interview, tamanna hot gossips, tamanna photo shoot, tamanna hot photo shoot, tamannah photos, tamannah interview

tamanna bhatia liplock bikini scenes bahubali bengal tiger movies : Milky beauty tamanna bhatia says that she will not compromise to act in bikini and liplock scenes anymore.

ఎట్టిపరిస్థితుల్లోనూ.. ఆ రెండు మాత్రం చేయనంటోంది!

Posted: 03/06/2015 11:14 AM IST
Tamanna bhatia liplock bikini scenes bahubali bengal tiger movies

ఇటీవలే సినీపరిశ్రమలో హీరోయిన్ల మధ్య పోటీ బాగానే పెరిగిపోయింది. కొత్త తారలు అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకడుగు వేయకుండా లిప్ లాక్, బికినీ సన్నివేశాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారికే ఎక్కువ అవకాశాలు వరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనని, ఆఫర్లు రావేమోనన్న భయంతో సీనియర్ హీరోయిన్లు కూడా ఆ సీన్లలో నటించేందుకు ఒప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో ఎంతోమంది తారలు చేరిపోయారులెండి! అయితే.. మిల్కీబ్యూటీ తమన్నా మాత్రం ఆ సన్నివేశాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయనంటూ ఖరాఖండీగా వెల్లడిస్తోంది.

దక్షిణాదితోపాటు హిందీలోనూ తమన్నా ఎన్నో సినిమాల్లో నటించింది. వాటన్నింటిలోనూ ఆమె లిప్ లాక్, బికినీ సీన్లలో నటించలేదు. స్ర్కిప్ట్ డిమాండ్ మేరకు హీరోలతో కాస్త రొమాన్స్ చేసిందే తప్ప.. మరింత హీటెక్కించే సీన్లలో నటించలేదు. అయితే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వస్తున్న తారలందరూ ఆయా సన్నివేశాల్లో నటిస్తూ యూత్ ని రక్తి కట్టిస్తున్నారు. అలాంటి సీన్లలో నటిస్తే తమకు మరిన్ని ఆఫర్లు వస్తాయన్న నమ్మకంతో వెంటనే ఒప్పేసుకుంటున్నారు. మరి.. మీరెందుకు అటువంటి సన్నివేశాల్లో నటించడం లేదని తమన్నాను ప్రశ్నిస్తే.. అందుకు తాను రాజీపడనంటూ తన సమాధానాన్ని వెలిబుచ్చింది ఆ భామ!

‘‘నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే బికినీ, ముద్దు సన్నివేశాలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాను. చాలామంది నన్ను ఒప్పిద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే కొందరు ఒత్తిడి చేస్తున్నారు కానీ.. నేను మాత్రం ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడను’’ అంటూ తమన్నా స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘బాహుబలి’ చిత్రంలో ఓ స్పెషల్ పాత్రలో నటిస్తుండగా.. రవితేజ సరసన ‘బెంగాల్ టైగర్ చిత్రంలో నటిస్తోంది. అటు తమిళంలోనూ ఓ మూవీ షూటింగులో ఫుల్ బిజీగా వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna bhatia  liplock scenes in movies  telugu heroines in bikini  

Other Articles