Vadde naveen tollywood re entry ram gopal varma manchu vishnu golusu movie

ram gopal varma, vadde naveen news, manchu vishnu news, manchu manoj news, manchu vishnu latest news, manchu manoj latest news, vadde naveen re entry news, vadde naveen latest gossips, ram gopal varma vadde naveen, manchu manoj varma movie, golusu movie updates, varma golusu movie news, varma manchu vishnu movies

vadde naveen tollywood re entry ram gopal varma manchu vishnu golusu movie : Vadde Naveen giving re entry in tollywood with manchu vishu and ram gopal varma's Golusu movie which is produced by manchu vishnu.

అజ్ఞాతంలో వెళ్లిన హీరోకి చేయూతనిచ్చిన వర్మ!

Posted: 02/23/2015 12:02 PM IST
Vadde naveen tollywood re entry ram gopal varma manchu vishnu golusu movie

‘పెళ్లి’, ‘ప్రియ ఓ ప్రియ’, ‘చాలా బాగుంది’ మొదలై చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు వడ్డె నవీన్.. ఆ తర్వాత మళ్లీ ఒక్క హిట్ సాధించలేదు. అంతే! అప్పటినుంచి ఆయన ఏ చిత్రంలోనూ నటించక, కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ సమయంలోనే వివాదాస్పద దర్శకుడు ఆయనకు చేయూతనిస్తూ.. తిరిగి రీఎంట్రీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం! అంటే.. నవీన్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నమాట!

మంచు మనోజ్ తో వర్మ ‘గొలుసు’ అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే! ఈ సినిమాలోనే ఓ నెగెటివ్ రోల్ కోసం వడ్డె నవీన్ ని ఎంపిక చేసినట్లు సమాచారం! గత సినిమాలతో పోల్చుకుంటే ఈ చిత్రంలో నవీన్ కాస్త డిఫరెంట్ గా, సరికొత్త లుక్ లో కనిపించనున్నాడని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ సినిమాతో నవీన్ రీఎంట్రీ ఘనంగా జరగబోతోందని, ఈ చిత్రం అతని సెకండ్ ఇన్నింగ్స్ కి ఎంతో తోడ్పడుతుందని యూనిట్ బృందం అభిప్రాయపడుతోంది. ఇక ఈ చిత్రం జగపతిబాబు కూడా కీలకపాత్రలో నటించనున్నాడన్న విషయం తెలిసిందే!

ఇదిలావుండగా.. ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి పేరు సాధించిన నవీన్ చివరి చిత్రం ‘శ్రీమతి కళ్యాణం‘ 2010లో రిలీజ్ అయింది. అయితే ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. ఇక అప్పటి నుంచి ఆయనకు ఆఫర్లు రాలేదు. దీంతో కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి కనిపించకుండా పోయారు. ఇప్పుడు వర్మ సహకారంతో మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అంతేకాదు.. మంచు విష్ణు నిర్మించనున్న మరో మూవీలోనూ ఈయన నటించనున్నాడని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles