Radhika apte mtv short films new international project anurag kashyap bollywood news

radhika apte, radhika apte latest news, legend beauty radhika apte, mtv international project, radhika apte mtv movies, radhika apte international movie, anurag kashyap news, director anurag kashyap hollywood movie, mtv short films project, mtv entertainment channel, radhika apte latest news, radhika apte anurag kashyap news

radhika apte mtv short films new international project anurag kashyap bollywood news : Legend actress radhika apte bags an huge offer in international short film which project is conducted by MTV Channel. She is acting in indian addition short film which is directed by anurag kashyap.

అంతర్జాతీయ చిత్రంలో బాలయ్య భామ...

Posted: 02/23/2015 10:42 AM IST
Radhika apte mtv short films new international project anurag kashyap bollywood news

బాలకృష్ణ సరసన ‘లెజెండ్’ సినిమాలో నటించి సక్సెస్ సాధించిన రాధిక ఆప్టే.. అప్పటినుంచి ఫుల్ జోష్ తో దూసుకుపోతోంది. మరోసారి బాలయ్యతో నటించే ఆఫర్ దక్కించుకోవడంతోపాటు అటు బాలీవుడ్ లో ‘బద్లాపూర్’ చిత్రంతో హిట్ కొట్టింది. దాంతో తన కెరీర్ మళ్లీ స్వింగ్ లోకి వచ్చిందన్న సంతోషంతో ఉప్పొంగుతున్న తరుణంలోనే మరో భారీ ఆఫర్ ఆమె చెంతకు చేరింది. ఏకంగా అంతర్జాతీయ చిత్రంలో అరుదైన అవకాశం ఈ అమ్మడికి వరించింది.

ప్రముఖ ఛానెల్ MTV ఓ భారీ ప్రాజెక్టు చేబడుతోంది. ఏడు షార్ట్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడు షార్ట్స్ ఫిలిమ్స్ లోని ఒక్కొక్క చిత్రానికి వివిధ దేశాలకు చెందిన ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహిస్తారు. అందులో ఇండియన్ వెర్షన్ కు దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆ చిత్రంలోనే రాధిక కథానాయికగా నటిస్తోంది. ఆ చిత్రంలోని సదరు పాత్రకు రాధిక అయితేనే బాగా సూటవుతుందన్న ఉద్దేశంతో ఆమెను తీసుకున్నట్లు సమాచారం!

ఇదిలావుండగా.. ఈ విధంగా తనకు MTV నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని రాధిక తెలుపుతోంది. ఈ చిత్రంతో తన ఇమేజ్ మరింత పెరిగే అవకాశముందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెలువడి కానున్నాయి.

 

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : radhika apte  anurag kashyap  mtv international short films  bollywood news  

Other Articles