మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకొని, ఇటీవలే రెండవ సీజన్ ను కూడా నాగార్జున వ్యాఖ్యతలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే కార్యక్రమం విజయవంతంగా ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మాములు వ్యక్తులతో పాటుగా సెలబ్రెటీలు కూడా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అనుష్క, శ్రియ, రకూల్ ప్రీత్ సింగ్, నితిన్, సందీప్ కిషన్, మంచు లక్ష్మీ, కాజల్, విశాల్, శ్రియ, విద్యాబాలన్... వంటి సెలబ్రెటీలు ఏదో సరదగా ఈ కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తెస్తున్నారు.
ఈ ప్రేమికుల రోజు సంధర్భంగా ఈ కార్యక్రమానికి ఇద్దరు అందమైన భామలు ప్రత్యేక అతిథులుగా విచ్చేయనున్నారు. ఒకరు సినీ హీరోయిన్ తమన్నా, మరొకరు టెన్సిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. తమన్నా, సానియా మీర్జాలు వేరు వేరుగా పాల్గొననున్నారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ పూర్తయ్యింది. ఈ ఎపిసోడ్ ను ప్రేమికుల రోజున ప్రసారం చేయనున్నారు.
ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో తమన్నా బిజీగా వుంది. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్ సరసన నటిస్తోంది. అలాగే రవితేజతో ‘బెంగాల్ టైగర్’ సినిమాలో నటించనుంది. ఇటీవలే ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more