Singer shreya ghoshal marriage shiladitya mukhopadhya

Shreya Ghoshal news, Shreya Ghoshal marriage, Shreya Ghoshal shiladitya, Shreya Ghoshal hot photos, Shreya Ghoshal songs, Shreya Ghoshal photos, Shreya Ghoshal hot news, Shreya Ghoshal latest news, Shreya Ghoshal ties knot, Shreya Ghoshal

Singer Shreya Ghoshal marriage Shiladitya mukhopadhya : Singer Shreya Ghoshal ties the knot with beau Shiladitya

బాయ్ ఫ్రెండ్’తో సీక్రెట్’గా పెళ్లి చేసుకున్న సెక్సీ సింగర్!

Posted: 02/06/2015 12:11 PM IST
Singer shreya ghoshal marriage shiladitya mukhopadhya

తన మధురమైనగానంతో ప్రేక్షకులమదిని దోచేసిన ప్రముఖ సింగర్ శ్రేయాఘోషల్ గురువారం రాత్రి తన బాయ్ ఫ్రెండ్’తో సీక్రెట్’గా వివాహం చేసుకుంది. ఎప్పటినుంచో అతనితో రిలేషన్’షిప్ కొనసాగించిన ఈ అమ్మడు.. పెళ్లి వార్త బయటకు లీక్ చేయకుండా రహస్యంగా జరుపుకుంది. Rasilant Technologies, hipcask.com ఫౌండర్ అయిన షిలాదిత్యా ముఖోపాధ్యాయతో ఈ అమ్మడు గతకొన్నాళ్ల నుంచి ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే! అయితే కెరీర్ పరంగా ఇద్దరూ దృష్టి సారించిన నేపథ్యంలో తమ పెళ్లికి కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు ఆ సమస్యలు దాదాపు తీరిపోవడంతో ఇద్దరూ ఏకమయ్యారు. వీరి పెళ్లి కుటుంబసభ్యలు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలోనే జరిగింది.

ఈ నేపథ్యంలోనే శ్రేయా పెళ్లి చేసుకోవడానికి ముందు (జనవరి 30వ తేదీన) ట్విటర్’లో తన ఎగ్జైట్’మెంట్ గురించి వెలిబుచ్చింది. ‘నేను నెర్వస్’గా వున్నానో లేక ఫుల్లీ ఎగ్జైట్’గా వున్నానో తెలియదు కానీ.. ఈ విధమైన ఫీలింగ్ ఇంతవరకు ఎప్పుడూ కలగలేదు. ఏదైమైనా.. త్వరలోనే నేను మీకు సమాచారాన్ని అందజేస్తాను. అందుకు నాకు మీ విషెస్ కావాలి’’ అంటూ పూర్తి వివరణ లేకుండా పోస్ట్ చేసి.. కన్ఫ్యూజన్’లో పెట్టేసింది. దాంతో ఆమె ఎగ్జైట్ మెంట్ ఏంటోనంటూ అందరూ అయోమయంలో పడిపోయారు. ఏదైతేనేం.. చివరకు ఈ అమ్మడు ఫిబ్రవరి 5వ తేదీన తన ప్రియుడితోనే వివాహం చేసుకుని, పెళ్లి ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి సర్పైజ్ చేసింది.

పెళ్లి అనంతరం ఈ అమ్మడు ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘‘కుటుంబసభ్యుల మధ్య బెంగాలీ ట్రేడిషన్’లో నేను ప్రేమించి వ్యక్తితో పెళ్లి చేసుకున్నాను. షిలాదిత్య, నేను మీ గుడ్ విషెస్ కోరుకుంటున్నాం’’ అంటూ సోషల్ మీడియాలో ఫోటో కూడా అప్’లోడ్ చేసింది. అన్నట్టు.. శ్రేయ తెలుగు, తమిళ భాషల్లోనూ పాటలు పాడినట్లు అందరికీ తెలిసిందే! చిత్రపరిశ్రమలో గాయనిగా తనకంటూ ముద్ర వేసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు ఇల్లాలిగా మారిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shreya Ghoshal marriage  shiladitya mukhopadhya  bollywood news  

Other Articles