ఈమధ్య మహిళలపై అత్యాచారాలు మరింతగా పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అని తేడాలేకుండా మహిళలపై మగాళ్లు మృగాల్లాగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి వారికి బుద్ధిచెప్పేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ.. ఫలితం లేకపోయింది. ఓవైపు దేశం సాంకేతికపరంగా దూసుకుపోతుంటే.. మరోవైపు ఈ దారుణాల సంఖ్య రెట్టింపవుతోంది. తరుచూ జరుగుతున్న ఈ దారుణాలను అణిచివేసే దిశగా మహిళల్లో స్ఫూర్తిని పెంచుతూ కొందరు తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు. మహిళల్లో ఆత్మబలం పెంపొందించేందుకు కొందరు తారలుసైతం ముందుకు వస్తున్నారు. ఈ కోవలోనే అనుష్క శర్మ కూడా పయనిస్తోంది. మహిళలు ఒంటరిగా వున్న సమయంలో పోకిరీలను ఎలా ఎదుర్కోవాలన్న అంశంతో ఈ అమ్మడు ఓ బలమైన కథతో తెరముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రస్తుతం ‘NH10’ అనే మూవీలో నటిస్తోంది. నిన్నటివరకు గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ భామ.. ఈసారి మహిళల్లో ఆత్మబలం పెంపొందించే దిశగా ఈ మూవీలో యాక్షన్ లేడిగా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లలో యాంగ్రీ యాక్షన్ లేడిగా దర్శనమిచ్చింది. ఆ ఫోటోలకు ప్రేక్షకులకు అనూహ్య స్పందన లభించింది. అందులో ఆమె గెటప్ అదుర్స్ అంటూ బాలీవుడ్ మొత్తం కితాబిచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలయ్యింది. ఈ ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే పాజిటివ్ రెస్సాన్స్’తో పొందడంతోపాటు.. అనుష్క ఇటువంటి కథాంశాన్ని ఎంచుకోవడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే.. ఈ ట్రైలర్’లో ఆమె యాక్షన్ సన్నివేశాలు అందరినీ అబ్బురపరిచే విధంగా వున్నాయి మరి!
ఇక ఈ ట్రైలర్’లోనే దాదాపు కథ మొత్తం రివీల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అనుష్కకు జోడిగా నటిస్తున్న నీల్.. ఇద్దరూ కలిసి ఓ టూర్’కు వెళ్తారు. అందులో భాగంగానే కాసేపు సేద తీర్చుకోవడానికి ఇద్దరూ ఓ ఢాబా దగ్గర ఆగుతారు. అయితే.. ఆ ఢాబా దగ్గరే ఎవరో కొంతమంది పోకిరోళ్లు వచ్చి ఒక అమ్మాయిని వేధిస్తుంటారు. ఆమెను బలవంతంగా తీసుకెళుతుంటారు. ఈ మొత్తం దృశ్యాన్ని గమనించిన అనుష్క, నీల్.. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ.. వాళ్లు వీరిని దెబ్బకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అక్కడితో ఓటమి ఒప్పుకోని ఈ జంట.. ఆ ఆకతాయిలు చేస్తున్న ఆకృత్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో నీల్’ను అనుష్క పోగొట్టుకుంటుంది. అందుకు ప్రతీకారంగా అనుష్క ఆ పోకిరీగాళ్లకు ఎలాంటి బుద్ధి చెప్పిందనే కథాంశంతో రూపొందినట్లు తెలుస్తోంది.
ఈ విధంగా యాక్షన్’తో కూడిన ట్రైలర్’ను వీక్షించిన కొందరు.. ఈ మూవీ మహిళల్లో ఆత్మబలం పెంపొందించేందుకు వారిలో స్ఫూర్తిని కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరు దశకు చేరుకోవడంతో అనుష్క ఈ మూవీని ప్రచారం చేసే పనుల్లో నిమగ్నమైంది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి, ఆ బ్యానర్లోనే ఈ మూవీని అనుష్క శర్మ రూపొందిస్తోంది. నవదీప్ సింగ్ దర్శకత్వ వహించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 6వ తేదిన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more