K raghavendra rao upcoming movie title krishnamayya

K Raghavendra rao Next movie title Krishnamayya, K Raghavendra rao new title Krishnamayya, K Raghavendra rao new movie Krishnamayya, Krishnamayya movie news, Krishnamayya movie details, K Raghavendra rao Krishnamayya movie updates, K Raghavendra rao, Nagarjuna Krishnamayya movie, Nagarjuna in Krishnamayya movie, Nagarjuna

K Raghavendra rao Upcoming movie title Krishnamayya: Director K Raghavendra rao new movie title Krishnamayya. akkineni nagarjuna will be act in this movie.

ఈసారి కృష్ణమయ్యతో మరో భక్తిరస చిత్రం

Posted: 02/04/2015 10:12 AM IST
K raghavendra rao upcoming movie title krishnamayya

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇప్పటికే అన్నమయ్య, పాండు రంగడు, శ్రీమంజునాథ, శ్రీరామదాసు, షిరిడిసాయి వంటి పలు భక్తిరస చిత్రాలొచ్చాయి. ఈ సినిమాలన్నీ కూడా మంచి ప్రజాధారణ పొందాయి. అయితే తాజాగా మరో భక్తిరస చిత్రం తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు.

నాగార్జున ప్రధాన పాత్రలో కె.రాఘవేంద్రరావు ఓ భక్తిరస చిత్రం రూపొందించనున్నాడని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ విషయాన్ని కె.రాఘవేంద్రరావు కన్ఫర్మ్ చేసారు. ఇటీవలే విశాఖపట్నంలో సింహాచలం దేవస్థానాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు కె.రాఘవేంద్రరావు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... త్వరలో ‘అన్నమయ్య’ వంటి భక్తిరస చిత్రాన్ని తెరకెక్కిస్తానని, ఆ చిత్రం పేరు ‘కృష్ణమయ్య’ అని చెప్పుకొచ్చారు.

మరి నాగ్, కె.రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా పేరు ‘కృష్ణమయ్య’ అవుతుందో లేక ఈ ‘కృష్ణమయ్య’ ప్రాజెక్టును మరో హీరోతో కె.రాఘవేంద్రరావు చేయనున్నాడో త్వరలోనే తెలియనున్నాయి. నాగార్జున ప్రస్తుతం ‘సొగ్గాడే చిన్నినాయన’ చిత్ర షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న మల్టీస్టారర్ చిత్రంలో నాగ్ నటించనున్నాడు. మరి రాఘవేంద్రరావు సినిమాలో ఎవరు నటిస్తారో, ఎప్పుడు మొదలుకానుందో త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : K Raghavendra rao  Krishnamayya  Nagarjuna  Movies  Devotional  Tollywood  

Other Articles