Police warnings bahubali movie raw video leakage social media websites spread

bahubali movie news, bahubali movie video, bahubali movie video leakage, bahubali movie gossips, bahubali movie schedules, bahubali movie photos, bahubali movie controversy, prabhas news, rana daggubati news, anushka shetty news, tamanna bhatia news, director rajamouli news

police warnings bahubali movie raw video leakage social media websites spread : Nowadays a video of bahubali movie of war scene has releaed in social media websites which is going viral in film industry.

‘బాహుబలి’పై పోలీసుల హెచ్చరికలు...

Posted: 01/27/2015 10:59 AM IST
Police warnings bahubali movie raw video leakage social media websites spread

తెలుగు చిత్రపరిశ్రమలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రంగా ‘బాహుబలి’ రూపొందుతున్న విషయం తెలిసిందే! దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ మెయిన్ లీడ్’లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గతరెండేళ్ల నుంచి ఎంతో రహస్యంగా జరుగుతూనే వుంది. సెట్స్’కి సంబంధించిగానీ, మూవీకి సంబంధించిన వ్యవహారాలుగానీ బయటకు లీక్ కాకుండా ఎంతో గోప్యంగా వుంచుతున్నారు. అంతా సవ్యంగానే జరుగుతున్న నేపథ్యంలో అనుకోకుండా కొన్ని పరిణామాలు చోటు చేసుకోవడంతో ఈ మూవీపై పోలీసులు హెచ్చరికలను జారీ చేశారు. దీంతో ఇది సంచలనంగా మారింది. అసలు పోలీసులకు, మూవీకి సంబంధం ఏంటని అనుకుంటున్నారు.. అయితే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

వివరాల్లోకి వెళ్తే.. గతకొన్నాళ్ల నుంచి ఎంతో గోప్యంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఇటీవలే 12 నిముషాల నిడివిగల ‘రా’ వీడియో ఫుటేజ్ యూట్యూబ్’లో లీకయ్యింది. దీనిని వెంటనే పసిగట్టిన యూనిట్ సభ్యులు యూట్యూబ్ నుంచి ఆ వీడియోను తొలగించడంలో సక్సెస్ అయ్యారు. కానీ.. ఆ వీడియో లీకైన వెంటనే కొందరు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ దెబ్బతో ఆ వీడియో సోషల్ మీడియాలో ఇంకా హల్’చల్ చేస్తూనే వుంది. ఒకరి తర్వాత మరొకరు దానిని షేర్ చేసుకుంటూ స్ర్పెడ్ చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై నిర్మాతలు, ఫిల్మ్ చాంబర్’కి చెందిన పైరసీ సెల్ వారు సీరియస్’గా తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు. ఈ వీడియోని ఎవరు లీక్ చేశారో అతడిని ముందుగా అరెస్ట్ చేశారు. బాహుబలి సినిమా విజువల్ ఎఫెక్ట్ ఎడిటింగ్ జరుగుతున్న చోట గతంలో పనిచేసిన ఉద్యోగే ఈ నేరానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించినట్లు చెబుటున్నారు. అలాగే సోషల్ మీడియాలో హల్’చల్ చేస్తున్న ఆ వీడియోను ఫేస్’బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వెబ్’సైట్లలో స్ర్పెడ్ చేస్తున్న వారిపై కేసులు ఫైల్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్’మెంట్స్, సైబర్ క్రైమ్ డివిజన్ వారు ఈ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారిని ట్రాక్ చేసి, వారిని పట్టుకోనున్నారు. ఇప్పటికే ఇలా కొంతమందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం!

మరెవరైనా ఆ లీకేజి వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినా, లైక్ కొట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారని పోలీసులతోబాటు ఫిల్మ్ ఇండస్ట్రీ పైరసీ టీం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఎంతో కష్టపడి చిత్రబృందం తెరకెక్కించిన ఈ మూవీలోకి ఓ వార్ సీక్వెన్స్ ఇలా బయటికి రావడంతో వాళ్ల కష్టం వృథా అయిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకనుంచి ఎవరూ ఆ వీడియోన్ షేర్ చేయకూడదని, తెలుగు ఇండస్ట్రీకి సిగ్గుచేటని అంతా అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles