Sonia agarwal ntr temper movie kajal agarwal puri jagannath bandla ganesh

sonia agarwal news, sonia agarwal temper movie, sonia agarwal hot photo shoot, sonia agarwal hot gallery, sonia agarwal ntr movie, temper movie news, kajal agarwal news, kajal agarwal hot photo shoot, kajal agarwal latest gallery, kajal agarwal photo session, sonia agarwal hot videos, ntr puri jagannath, ntr temper movie new, director puri jagannath, bandla ganesh, parameshwara arts banner

sonia agarwal ntr temper movie kajal agarwal puri jagannath bandla ganesh : the sexiest actress sonia agarwal got a huge offer in ntr temper's movie.

‘టెంపర్’ ఎక్కిస్తున్న కాలనీ అమ్మడు..

Posted: 01/27/2015 10:26 AM IST
Sonia agarwal ntr temper movie kajal agarwal puri jagannath bandla ganesh

గతంలో ‘7G బృందావన కాలనీ’ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులను టెంపర్ ఎక్కించిన సోనియా అగర్వాల్.. ఇన్నాళ్లకు మళ్లీ తన తెరపై తన అందాలు పరిచేందుకు సిద్ధమవుతోంది. ఈ కాలనీ అమ్మడికి 7జీ మూవీ తర్వాత మరేమీ ఆఫర్లు రాలేదు. దాంతో తమిళంలో రెండేసి సినిమాలు చేసి తర్వాత పెళ్లి చేసుకుంది. కానీ భర్తతో గొడవలు వచ్చిన నేపథ్యంలో అతనితో విడిపోయి.. ఇండస్ట్రీలో తన రెండో ఇన్నింగ్ కొనసాగిస్తోంది. నిన్నటివరకు చిన్నసినిమాల్లో అరకొర పాత్రలు చేసిన ఈ భామ.. ఇప్పుడు బంపరాఫర్ కొట్టేసింది. ఎన్టీఆర్ సినిమాలో ఓ కీలకపాత్రలో నటించే అవకాశాన్ని ఈ అమ్మడు దక్కించుకుంది.

ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘టెంపర్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ఈ చిత్రంలో ఈ అమ్మడు ఎన్టీఆర్ సరసన నటించే ఓ బంపరాఫర్ ను దక్కించుకుంది. ఈమె పాత్రతోనే మూవీలో కొన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇలా ఈ విధంగా తనకు ఓ భారీ చిత్రంలో ఆఫర్ రావడంతో సంతోషంలో సోనియా మునిగితేలుతోంది. ఒకవేళ ఈమె పాత్ర క్లిక్ అయితే మాత్రం.. మరిన్ని మూవీల్లో ప్రత్యేక పాత్రల్లో నటించే అవకాశాలు వరుసబెట్టే ఛాన్సెస్ వున్నాయి. పైగా.. ఇందులో సోనియా కొంచెం ఘాటుగా కూడా కనిపిస్తుందని యూనిట్ బృందం తెలుపుతోంది.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్’గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్’లో ప్రముఖ నిర్మాత బండ్లగణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ పాటలు అందిస్తున్న ఈ చిత్రం చివరి పాటను ప్రస్తుతం హైదరాబాద్’లోని సెట్స్’లో చిత్రీకరిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఫిబ్రవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles