Yvs chowdary latest interview rey movie news

rey movie news, rey movie release date, rey movie photos, yvs chowdary news, director yvs chowdary interview, yvs chowdary rey movie, shraddha das news, shraddha das hot photo shoot, sai dharam tej news, sai dharam tej movie news

yvs chowdary latest interview rey movie news : director yvs chowdary said that he is going to release his latest movie Rey in few days. Everyone is helping out of financial problems of this movie.

‘రేయ్’.. సవాలుకు సర్వం సిద్ధం చేసిన చౌదరి!

Posted: 01/19/2015 10:21 AM IST
Yvs chowdary latest interview rey movie news

ఇండస్ట్రీలో కొత్త నటీనటులను పరిచయం చేస్తూ వారికి మంచి భవిష్యత్తును కల్పించిన దర్శకుడు వైవీఎస్ చౌదరి.. ఇటీవలే ఆర్థిక ఇబ్బందుల్లో తీవ్రంగా కూరుకుపోయిన విషయం తెలిసిందే! అందుకే.. ఆయన రెండేళ్ల క్రితమే మెగాహీరో సాయి ధరమ్ తేజ్’ను పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘రేయ్’ చిత్రం ఇంకా విడుదల కాలేదు. ఇదిగో ఇప్పుడు, అదిగో అప్పుడు అంటూ రిలీజ్ తేదీని వాయిదాల మీద వాయిదాలు చేస్తూ ఆయన చివరికి కనిపించకుండా పోయారు.

నిజానికి.. ఈయన సినిమాను ఎంతగా ఆరాధిస్తాడంటే.. ఎన్ని కష్టనష్టాలొచ్చినా ఎప్పటికప్పుడు సినిమాలు తీస్తూనే వుంటాడు. కానీ ‘రేయ్’ విషయంలో ఆ కష్టాలు మరీ పీక్’కి వెళ్లిపోవడంతో ఆ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ చిత్రం చౌదరీ కెరీర్’లోనే అతిపెద్ద సవాలుగా మారింది. అనుకున్నదానికంటే బడ్జెట్టు మరింతగా మించిపోవడంతోనే ఈ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ దెబ్బతోనే ఆయన ఇన్నాళ్లు బయటపడలేక చిత్రం విడుదలను చాలాసార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారాల ప్రకారం.. వైవీఎస్ చౌదరి ‘రేయ్’ చిత్రాన్ని విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఏదిఏమైనా.. ఈ మూవీని విడుదల చేసితీరాలని ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం గురించి మాట్లాడిన ఆయన.. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తానని ఆయన తాజాగా వెల్లడించాడు. ఇందుకు తనకు ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సాంకేతిక నిపుణులతో సహా ప్రతిఒక్కరూ సహకరిస్తున్నారని ఆయన అన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rey movie news  director yvs chowdary news  sai dharam tej news  

Other Articles