A s ravi kumar next movie with nithin

A S Ravi Kumar movies, A S Ravi Kumar Nithin movie, A S Ravi Kumar next movie, Nithin next movie, Nithin movies, Nithin Wallpapers, Chinnadaana Neekosam movie, Chinnadana Neekosam collections, Chinnadana neekosam movie, tollywood updates, upcoming telugu movies

A S Ravi Kumar next movie with Nithin : tollywood latest news that Nithin agreed to act with A S Ravi Kumar who made Pilla nuvvu Leni Jeevitham. Chinnadana Neekosam given an average talk, to overcome that Nithin planning a movie with Chowdary

నితిన్ నెక్స్ట్ సినిమా ఓకే.. కానీ కాస్త గ్యాప్

Posted: 01/13/2015 12:51 PM IST
A s ravi kumar next movie with nithin

‘చిన్నదాన నీకోసం’ అంటూ ఈ మద్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నితిన్ త్వరలోనే మరో సినిమా తీస్తున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న ‘చిన్నదాన నీకోసం’ సినిమా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో ఏ మాత్రం తగ్గకుండా వెంటనే మరో సినిమా తీసి తానేంటో నిరూపించుకోవాలని కసిగా ఉన్నాడు. సొంత బ్యానర్, ప్రొడ్యూసర్ కుటుంబం నుంచి రావటంతో ఏ ఇబ్బందులు ఉండవని భావించి చాలామంది డైరెక్టర్లు కథలు చెప్పేందుకు ముందుకు వస్తున్నారట. ఇప్పటివరకు పలువురు అగ్ర డైరెక్టర్లు స్ర్కిప్టులు చెప్పారని సన్నిహితులు అంటున్నారు.

అందర్లోకి ఎ.ఎస్. రవికుమార్ చౌదరి చెప్పిన కథ బాగా నచ్చిందట. దీంతో సినిమా చేయటానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. నితిన్ హామితో రవికుమార్ స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టాడని టాక్ విన్పిస్తోంది. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ తో సాయి ధరమ్ తేజ్ కు హిట్ ఎంట్రీ అందించిన డైరెక్టర్.., అయోమయంలో పడ్డ నితిన్ ను పైకి తీసుకొచ్చేందుకు కసిగా కష్టపడుతున్నాడట. కథకు కాస్త కమర్షియల్ యాంగిల్స్ జోడించి.., ఎంటర్ టైనింగ్ సినిమాగా చూపిస్తాడని చెప్తున్నారు.

అయితే నితిన్ - రవికుమార్ ప్రాజెక్టు ఇప్పట్లో మొదలు కాదు అని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు. నిర్మాతగా మారిన నితిన్ ప్రస్తుతం అఖిల్ తొలి సినిమా పనులను చూసుకుంటున్నాడు. జనవరి 20 నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుండటంతో నిర్మాణ పనులన్నీ స్వయంగా చూసుకోవాలని భావిస్తున్నాడు. తొలి ప్రాజెక్టు కావటంతో అనుభవం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నితిన్ భావిస్తున్నాడు. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక లేదా.., చివరిదశకు చేరుకుంటే కానీ రవికుమార్ సినిమా మొదలు కాదన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : A S Ravi Kumar  Nithin  Tollywood updates  

Other Articles