Jayasudha younger son shreyan kapoor debut soon

Jayasudha younger son, Jayasudha younger son Shreyan Kapoor, Shreyan Kapoor debut, Shreyan Kapoor movie, Shreyan Kapoor movie updates, Shreyan Kapoor, Jayasudha family, Jayasudha movies, tollywood updates, upcoming telugu movies, latest telugu movies, Vasu manthena

Jayasudha younger son shreyan kapoor debut soon : Vetaran actress Jayasudha all set to launch his younger son into tollywood as hero. Shreyan kapoor will soon seen as hero in tollywood he going to act movie with debut director vasu manthena

త్వరలోనే ఏడు అడుగుల బుల్లెట్టు ఎంట్రీ

Posted: 01/10/2015 03:41 PM IST
Jayasudha younger son shreyan kapoor debut soon

టాలీవుడ్ ఇండస్ర్టీకి త్వరలోనే కొత్త హీరో పరిచయం కానున్నాడు. మంచి కథేబ దూసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఏడు అడుగుల బుల్లెట్టులా కన్పిస్తున్న ఈయనెవరనేగా ఆలోచిస్తోంది. ఈ హీరో మరెవరో కాదు.., సీనియర్ నటి జయసుధ చిన్నబ్బాయి. పేరు శ్రేయన్ కపూర్. హైట్ లో తల్లి కంటే ఎక్కువ ఎత్తు ఎదిగిన శ్రేయన్, ఇండస్ర్టిలో తల్లిలా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అన్నీ సెట్ చేసుకుని ఒకేసారి మిస్సైల్ లా దూసుకువచ్చేందుకు సిద్దమవుతున్నాడు.

కొత్త హీరో అయినా జయసుధ వెనక ఉండి అన్ని విషయాలు వివరిస్తుండటంతో చాలా మెచ్యూర్డ్ గా ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాడు. తొలి సినిమా కోసం ఇప్పటికే కథలు కూడా విన్నాడు. వాసు మంతెన అనే కొత్త వ్యక్తి చెప్పిన కథ చాలా బాగా నచ్చటంతో ఆయనతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ గా వాసుకు తొలి సినిమా అయినా తొలి సినిమాను సొంతంగా నిర్మిస్తాడట. డైరెక్టర్ కు హైదరాబాద్ లో విద్యాసంస్థలు ఉండటంతో డబ్బు పెద్దగా సమస్య కాదు అని టాక్ విన్పిస్తోంది.

ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న ప్రాజెక్టు ప్రిప్రొడక్షన్ పనులు త్వరలోనే జరుగుతాయని జయసుధ సన్నిహితులు చెప్తున్నారు. ప్రస్తుతం సినిమా ఆఫర్లు కాస్త తగ్గటంతో జయసుధ పూర్తిగా కొడుకు ఎంట్రీపై దృష్టి పెట్టింది. హీరోయిన్, ఇతర నటులు, టెక్నీషియన్ల ఎంపికను సంక్రాంతి తర్వాత ప్రారంభించి ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇండస్ర్టికి కొత్తగా వస్తున్న శ్రేయన్ కపూర్ కు ‘తెలుగు విశేష్’ స్వాగతం పలకటంతో పాటు ఆల్ ది బెస్ట్ చెప్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shreyan Kapoor  Vasu Manthena  Jayasudha movies  

Other Articles