Gopala gopala movie release updates

Gopala Gopala release, Gopala Gopala release on 10th January, Gopala Gopala wallpapers, Gopala Gopala latest updates, Gopala Gopala trailer, Gopala Gopala songs, Gopala Gopala audio launch, I movie release date, I movie release problems, High Court on I release problems, 2015 sankranti release movies, upcoming telugu movies

Gopala Gopala movie release updates : It looks that Gopala Gopala movie only releasing for sankranti no other movies not possible to release. i movie got high court stay order from release because of finance problems

సంక్రాంతి సంబరమంతా ఒక్కడిదే.. సోలోగా ‘గోపాల గోపాల’ రిలీజ్

Posted: 01/09/2015 08:35 AM IST
Gopala gopala movie release updates

పోటీలో ఎంతోమంది ఉండవచ్చు కానీ.., చివరి వరకు వెళ్ళి గెలిచేది మాత్రం ఒక్కడే. సంక్రాతి రేసులో ఎన్నో సినిమాలు నిలవగా.., చివరి వరకు వెళ్లి పండగకు విడుదల అవుతున్న సినిమా ‘గోపాల గోపాల’ మాత్రమే. పండగకు ప్రధాన పోటిగా ఉన్న శంకర్ సినిమా కూడా విడుదల అయ్యే అవకాశం లేకపోవటంతో సంక్రాంతి సంబరమంతా ఒక్కడిదే అని స్పష్టం అవుతోంది. పండగ కానుకగా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ అందుకున్న ‘గోపాల గోపాల’ ప్రపంచ వ్యాప్తంగా శనివారం విడుదల అవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ లు పూర్తి కాగా.., ఆన్ లైన్ టికెట్ బుకింగ్ కూడా తుది దశకు చేరుకుంది. తొలిరోజు సినిమాను చూసేందుకు పవన్, వెంకీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీమేక్ సినిమా అయినా.., ‘ఓ మై గాడ్’ సినిమాను చూసినా, పవన్ ఎలా నటించాడో చూడాలని ఆసక్తిగా ఉన్నారు. సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో పాటు పాటలకు కూడా మంచి స్పందన రావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

సంక్రాంతి రేసులో ఉన్న ‘ఐ’ సినిమాకు కోర్టు కష్టాలు ఎదురయ్యాయి. గురువారమే క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ అందుకుని 14న విడుదలకు సిద్దమవుతున్న సినిమాపై మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఫైనాన్సియర్లకు బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో వారు కోర్టుకు ఎక్కారు. దీంతో సినిమా విడుదల ఆపాలంటూ కోర్టు స్పష్టం చేసింది. చివరి నిమిషంలో ఇలా జరగటంపై ఫ్యాన్స్ నుంచి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సమస్యలు తొలగుతాయని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 14నే తెలుగు డబ్బింగ్ వర్షన్ విడుదల అవుతుందని నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెప్పారు.

RELATED GALLERYS:

గోపాల గోపాల మూవీ వాల్ పేపర్స్

గోపాల గోపాల వెంకటేష్ కొత్త ఫోటోలు

గోపాల గోపాల కు సంభందించి మరిఎన్ని సమాచారం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopala Gopala  I movie  2015 sankranti telugu movies  

Other Articles