Swarna kankanam award for dasari narayana rao

Dasari Narayana Rao award, Dasari Narayana Rao for Swarna Kankanam Award, swarna kankanam award, shoban babu award, Dasari Narayana Rao movies, Dasari Narayana Rao latest, Dasari Narayana Rao vs chiranjeevi, tollywood updates, latest telugu movies

Swarna Kankanam award for Dasari Narayana Rao : Veteran director and actor Dasari Narayana Rao honoured with rare award. Dasari will receive Swarna Kankanam award on 10tj january with telangana seva samithi and Shrutilaya Arts Acadamy

డైరెక్టరన్నకు సోగ్గాడి స్వర్ణ కంకణం

Posted: 01/08/2015 10:49 AM IST
Swarna kankanam award for dasari narayana rao

ప్రముఖ దర్శకుడు, నటుడు దాసరి నారాయణ రావుకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవను గుర్తిస్తూ శోభన్ బాబు ‘స్వర్ణ కంకణం’ అవార్డు వరించింది. ఈ విషయాన్న శోభన్ బాబు అభిమాన సంఘం వెల్లడించింది. శోభన్ బాబు జయంతిని పురస్కరించుకుని ఈ పురస్కారం అందంచనున్నారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమి, తెలంగాణ సేవా సమితి ఆద్వర్యంలో జనవరి 10న రవీంధ్ర భారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో దాసరి ఈ గౌరవాన్ని పొందనున్నారు.

తనకు ఈ గౌరవం దక్కటం పట్ల దాసరి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గొప్ప నటుడు శోభన్ బాబు పేరున ఏర్పాటు చేసిన ఈ గౌరవ పురస్కారం తనకు లభించటం చాలా సంతోషాన్ని ఇస్తోందన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే హీరో శోభన్ బాబు అని చెప్పారు. దాసరితో పాటు కమెడియన్ శివారెడ్డి కూడా శోభన్ బాబు మెమోరియల్ అవార్డు అందుకోనున్నారు. తనకు మహానటుడి పేరుపై ఉన్న అవార్డు వరించటం చాలా సంతోషంగా ఉందని కమెడియన్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దాసరి సినిమా జీవితం :

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దాసరి నారాయణ రావు, తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. నటుడుగా, నిర్మాత, రచయత, దర్శకుడు, సంగీత దర్శకుడుగా అనేక విభాగాల్లో పనిచేశారు. ఎక్కువగా సామాజిక చైతన్యం కలిగించే సినిమాలతో పాటు, సమాజంలో ఉన్న సమస్యలు, సందేశాత్మక సినిమాలు నిర్మించి సామాన్య ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఇప్పటివరకు 250కి పైగా సినిమాల్లో నటించారు. దాదాపు 150 సినిమాలకు దర్శకుడిగా, 53సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. రెండు సార్లు జాతీయ అవార్డులు, తొమ్మిది నంది అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా ఐదు సార్లు సౌత్ ఇండియా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసిన వ్యక్తిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో నిలిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari Narayana Rao  Swarna Kankanam Award  tollywood  

Other Articles