Balakrishna car steal controversy

Balakrishna car stolen, Balakrishna car theft, Balakrishna car updates, Balakrishna Lion movie Updates, Balakrishna Lion movie updates, NBK Lion Wallpapers, NBK Lion teaser, NBK Lion audio release date, tollywood latest, telugu movie updates

Balakrishna car steal controversy : filmnagar rumors that Nandamuri Balakrishna car has stolen from Lion movie shooting spot. producer of movie condemned rumor of balayya car stolen says there is nothing stolen from movie shooting spot. NBK Lion movie shooting going to complete in time

ఇంతకీ పోయిందా.. ఉందా

Posted: 01/05/2015 09:52 AM IST
Balakrishna car steal controversy

ఆ మద్య ‘రుద్రమదేవి’ సినిమా షూటింగ్ జరిగినప్పుడు నగలు పోయిన విషయం కలకలం రేపింది. షూటింగ్ సమయంలో అద్దెకు తెచ్చిన నగలు పోవటంతో వాటిని ఎలా తెచ్చివ్వాలా అని మూవీ యూనిట్ ఆందోళన చెందింది. ఆ వివాదం ముగియగా.., ప్రస్తుతం బాలయ్య సినిమా షూటింగ్ లో కూడా చోరి జరిగినట్లు పుకార్లు వస్తున్నాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.., ‘ఎన్.బి.కె లయన్’ పేరుతో బాలయ్య హీరోగా వస్తున్న సినిమా షూటింగ్ హయత్ నగర్ సమీపంలో జరుగుతోంది. సినిమాలో బాలకృష్ణ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కారును వాడుతున్నారు. ఈ కారు షూటింగ్ స్పాట్ నుంచి మాయం అయినట్లు గుర్తించారు.

కారు చోరీపై హయత్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు కూడా చేశారట. ఈ విషయం ఆదివారం రాత్రి ఎలక్ర్టానిక్ మీడియాలో కూడా వచ్చింది. అయితే ఈ పుకార్లను సినిమా నిర్మాత రుద్రపాటి రమణారావు ఖండించారు. షూటింగ్ స్పాట్ నుంచి ఎలాంటి వస్తువులు చోరికి గురికాలేదన్నారు. షూటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని వివరణ ఇచ్చారు. కొందరు కావాలని ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని వివరించారు. బాలయ్యపై పుకార్లు పుట్టించే అవసరం ఎవరికి ఉంటుంది. అయినా కారు పోయిందని చెప్తే ప్రత్యర్దులకు వచ్చే లాభమేమిటి. దాని బదులు, షూటింగ్ ఆగిపోయిందనో.., సినిమా ఆగిపోయిందనో చెప్తే లాభం కదా అని అనుమానాలు వస్తున్నాయి.

అయితే షూటింగ్ జరిగే స్పాట్ ప్రముఖ స్థలం కావటంతో అక్కడ కారు పోయిందంటే పేరు పోతుందనే భయంతోనే చోరి జరిగినట్లు బయటకు చెప్పటంలేదని తెలుస్తోంది. అంతేకాకుండా బాలయ్య ఎమ్మెల్యే కావటంతో ఎప్పుడూ సెక్యురిటీ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కారు పోయిందంటే అన్ని వైపుల నుంచి విమర్శలు, అనుమానాలు వస్తాయనే విషయాన్ని కప్పి పెట్టి ఉంచుతున్నట్లు తెలుస్తోంది. కారు నిజంగా పోయిందా లేక.. కావాలనే పుకార్లు పుట్టించారా తెలియాల్సి ఉంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NBK Lion  Balakrishna car  latest updates  

Other Articles