Allari naresh poster first look from bandipotu

Allari Naresh, Naresh, Allari Naresh latest news, Allari Naresh movies, Allari Naresh first look poster, Allari Naresh poster first look, Allari Naresh photos, Allari Naresh bandipotu movie, Naresh bandipotu movie, Allari Naresh movie collections, Allari Naresh latest updates, Allari Naresh movie news, Allari Naresh cinema News, Allari Naresh upcomming movies, Allari Naresh new look,

Allari Naresh increases craze on Bandipotu by his poster first look

అదరగోట్టే పోస్టర్ ఫస్ట్ లుక్ తో బంధిపోటు వచ్చేశాడు..

Posted: 01/01/2015 02:13 PM IST
Allari naresh poster first look from bandipotu

కామెడీ హీరోగా తనకంటూ కొత్త ఒరవడిని సృష్టించుకుటూ ముందుకు దూసుకుపోతున్న హీరో అల్లరి నరేష్. తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకునేందుకు త్వరలో మనముందుకు బంధిపోటుగా రాబోతున్నారు. మీ హౄదయాలతో పాటు దోంగలను దోచుకునే ఇతివృత్తంలో చిత్రం రూపోందినట్లు సమాచారం. మార్స్ మీదకు ఉపగ్రహాన్ని పంపుతున్న నేటి రోజుల్లో పాత బందిపోటు ఒరవడికి, ఆహార్యానికి పూర్తి భిన్నంగా లేటెస్ట్ బందిపోటులా వస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా న్యూ పోస్టర్ ను చిత్ర నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది.

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వస్తున్న బందిపోటు సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలో నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి తర్వాత సినిమాను విడుదల చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇవివి సినిమా స్టిల్స్ అద్భుతంగా వున్నాయని, అల్లరి నరేష్ ను ఢిఫరెంట్ గెటప్ లో చూసిన ప్రేక్షకులలో బంధిపోటు చిత్రంపై ఆసక్తిని పెంచుకున్నారు. అల్లరి నరేష్ స్టైలిష్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అల్లరోడు నటించిన ఇతర సినిమాలకు భిన్నంగా చాలా అందంగా ఈ స్టిల్స్ లో కనిపించాడు నరేష్. నరేష్ సరసన ‘అంతక ముందు ఆ తర్వాత’ ఫేం ఈషా జంటగా నటిస్తుండగా, శ్రద్ధా దాస్ ప్రత్యేక పాత్రలో నటించింది. ఓ స్పెషల్ సాంగులో శ్రద్ధా సందడి చేయనుంది. చిత్రానికి సంగీతాన్ని కళ్యాణి కోడూరి అందిస్తుండగా, ఇ.వి.వి. సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ నిర్మిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  Bandipotu  Allari Naresh latest updates  

Other Articles