Sruti hassan tevar item song creates record

Sruti Hassan, Sruti Hassan movies, Sruti Hassan song in Tevar, Sruti Hassan latest updates, Sruti Hassan Item song, Sruti Hassan song in Tevar movie, Sruti Hassan photos, Sruti Hassan latest photos, Sruti Hassan wallpapers, Sruti Hassan updates, Tevar movie, Tevar movie updates, Tevar movie shooting photos, Tevar movie photos, Tevar movie wallpapers, bollywood updates, bollywood latest

Sruti Hassan Tevar Item Song Creates Records : Top Herorine Sruti Hassan Item song In Tevar movie become a record in youtube by one million clicks. Tevar movie shooting gears up to complete intime Sruti Hassan sings a song for this movie.

శృతిని చూసి భయపడుతున్న భామలు

Posted: 12/30/2014 11:12 AM IST
Sruti hassan tevar item song creates record

ఆల్ రౌండర్ గా మారిన ఐరన్ లెగ్ ను చూస్తే అందరికి భయమేస్తోంది. ఎప్పుడు ఎవరి కొంప ముంచుతుందా అని హీరోయిన్లంతా కంగారుపడుతున్నారు. ఇండస్ర్టీలోకి వచ్చిన మొదట్లో ‘ఈమె సినిమానా.., అయితే ఫ్లాపుగా రాసుకొండి’ అని మూవీ విశ్లేషకులు విమర్శించారు. అలాంటి వారి తోనే.., అమ్మడి మూవీ అయితే హిట్ ఖాయం అన్పించుకునేలా చేసింది. అలా నటనలో తన టాలెంట్ నిరూపించుకున్న శృతి హాసన్ ఇతర విభాగాల్లోనూ సత్తా చాటుతోంది. ఆ మద్య సినిమాకు పాట పాడితే., బాగా పాపులర్ అయింది. తర్వాత ఓ మూవీకి డబ్బింగ్ చెప్తే కూడా మంచి స్పందన వచ్చింది. ఇంతటితో ఆగలేదు... అన్నింటిలో వేలు పెడతా అని ఇతర విభాగాలను కూడా ప్రయత్నించి ఫలితాలు సాధించింది.

ఈ మద్య హీరోయిన్లంతా కాసులు, క్రేజు కోసం ఐటం సాంగులు చేస్తుండటంతో., మనమూ చేస్తే పోలా అనుకుని ట్రై చేసింది. గోల్డెన్ లెగ్ దెబ్బకు మిగతా వారంతా కుదేలవుతున్నారు. తాజాగా బాలీవుడ్ మూవీ ‘తేవర్’ కోసం అమ్మడు ఐటం సాంగ్ లో డాన్స్ చేసింది. కలువ కళ్ల భామ కాళ్లూపినా, చేయి కదిపినా కనుల విందే... అనుకుని తెగ చూసేశారు. దీంతో ఈ ఐటం సాంగ్ వీడియోకు యూ ట్యూబ్ లో మిలియన్ కు పైగా లైకులు వచ్చాయి. అతి తక్కువ కాలంలో ఐటం సాంగ్ వీడియోకు ఇన్ని లైకులు రావటం ఓ రికార్డు.

హీరోయిన్ గా ఇప్పటికే టాప్ లో ఉన్న శృతి, డబ్బింగ్, పాటలు పాడటం సహా చివరకు ఐటం సాంగులతోనూ హిట్లు కొడుతుంటే.., ఇంక తమకెలా ఆఫర్లు వస్తాయని మిగతా హీరోయిన్లంతా కంగారుపడుతున్నారట. అటు ఐటం సాంగ్స్ కోసమే జీవితం అంకితం చేసుకున్న అందగత్తెలు తమ పొట్ట కొడుతోందని అమ్మడిపై సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహేష్ మూవీలో నటిస్తూ బిజీగా ఉందీ చెన్నై భామ. ఇది కాకుండా విజయ్ తో కూడా తమిళంలో ఓ సినిమా చేస్తోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మిగతా ఆఫర్లకు డే్ట్లు అడ్జస్ట్ చే్స్తానని చెప్పటంతో ఆ సమయం ఎప్పడొస్తుందా అని డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sruti Hassan Item song  Tevar movie  Bollywood Updates  

Other Articles