Thagubothu ramesh kannada debut movie

thagubothu ramesh hero, thagubothu ramesh hero role movie, thagubothu ramesh kannada movie, thagubothu ramesh latest movie updates, telugu comedian videos, telugu comedian become heros, tollywood latest news updates

thagubothu ramesh kannada debut movie : taagubothu ramesh to become hero with a trishul bilingual movie shoots in kannada. tagubothu ramesh debut kannada movie by trishul shoots in bilingual with meghana patel heroine

డ్రింకింగ్ స్టార్ జిందాబాద్

Posted: 12/26/2014 08:58 AM IST
Thagubothu ramesh kannada debut movie

తెలుగు సినిమాల్లో తాగుబోతు క్యారెక్టర్లకు ఎం.ఎస్. నారాయణ తర్వాత న్యాచురాలిటీ తీసుకొచ్చిన నటుడు తాగుబోతు రమేష్. ‘అలా మొదలైంది’లో అబ్బా తమ్ముడూ అంటూ ఇండస్ట్రీ కెరీర్ మొదలు పెట్టిన రమేష్ ప్రస్తుతం  బిజీ కమెడియన్ గా ఉన్నాడు. సినిమాలో తాగుబోతు వేషం ఉందంటే అక్కడీ నల్లబాలు ఉండాల్సిందే. మందు తాగే అలవాటు లేకున్నా... అచ్చం తాగినోడిలా నటించే ఈ క్యారెక్టర్ ఆర్టిస్టుకు మంచి రోజులు వచ్చాయి. నటనను నమ్ముకుని చిన్నచిన్న వేషాలు వేసిన రమేష్ త్వరలో హీరో అవుతున్నాడు.

తెలుగు ప్రజెంట్ పాపులర్ కమెడియన్లలో ఒకడైన రమేష్ ను కన్నడ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. డైరెక్టర్ త్రిశూల్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కన్నడ, తెలుగు భాషల్లో షూట్ అవుతుండటంతో.., రమేష్  విశ్వరూపం చూసేందుకు తెలుగువారికీ అవకాశం దక్కనుంది. ద్విబాషా చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో మేఘనా రెడ్డి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే బెంగళూరులో ప్రారంభమైంది.

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రమేష్, చిన్నప్పటినుంచీ నటనపై ఆసక్తి. కుటుంబంలో అంతా మిగతా రంగాల్లో స్థిరపడ్డా, రమేష్ మాత్రం నటుడిగా నలుగురినీ  మెప్పించాలని చాలా కష్టపడ్డాడు. ఈయన కోరికను కాదనలేక కుటుంబ సభ్యులు ప్రోత్సహించటంతో కమెడియన్ గా ఎదిగాడు. తన తండ్రి తాగి ఇంటికి వచ్చాక ప్రవర్తించే విధానం బాగా గమనించిన రమేష్ కు ఆయనలా నటించటం వచ్చు. మందు తాగే అలవాటు లేకపోయినా.., తండ్రిని గుర్తు చేసుకుంటే వెంటనే క్యారెక్టర్లోకి దూరిపోతాడు. తాగుబోతుగా అందర్నీ మెప్పించిన ఈ డ్రింకింగ్ స్టార్ హీరోగా ఉన్నత స్థాయికి ఎదగాలని ‘తెలుగు విశేష్’కోరుకుంటోంది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : thagubothu ramesh latest  trishul bilingual movie  meghana pates updates  

Other Articles