Nithin chinnadana neekosam pawan kalyan song gay dance

nithin insults pawan kalyan, chinnadana neekosam pawan kalyan song, chinnadana neekosam pawan kalyan photo, chinnadana neekosam review and rating, chinnadana neekosam public response, chinnadana neekosam collections, nithin on pawan kalyan, pawan fans on nithin chinnadana neekosam song

nithin chinnadana neekosam pawan kalyan song gay dance : hardcore fans of pawan kalyan hurted by nithin behaviour because of hero's dance with gays for pawan kalyan song. pawan fans feels angry about gay dance for power star dance scene in nithin latest movie

పవర్ స్టార్ ఫ్యాన్ అంటూ, పవన్ ని అవమానించాడు

Posted: 12/26/2014 08:26 AM IST
Nithin chinnadana neekosam pawan kalyan song gay dance

పవన్ కళ్యాణ్ కోసం కోసుకుంటా.. గుండెల్లో దాచుకుంటా అని చెప్పే హీరో ఏకంగా పవర్ స్టార్ నే అవమానించాడు. స్టార్ పేరు వాడుకుని పైకి వస్తున్న హీరో పవర్ స్టార్ ఇమేజ్ దెబ్బతీసేలా ప్రవర్తించాడు.
పవన్ పేరును ఎందుకు జపిస్తున్నాడో సినిమాలో చూపించాడు. అవమానించాలనే ఉద్దేశ్యంతో చేయకపోయినా.., ‘చిన్నదాన నీకోసం’లో ఉన్న పవన్ పాట ఫ్యాన్స్ ను చాలా హర్ట్ చేస్తోంది. నితిన్ ఎందుకు ఇలా చేశాడు అని పవనిజం అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

మొదటి నుంచీ పవన్ ఫ్యాన్ అయిన నితిన్ తన లేటెస్ట్ సినిమా ‘చిన్నదాన నీకోసం’లో పవన్ ఫ్యాన్ పాత్రను పోషించాడు. అంతేకాదు వీరాభిమానం చాటుకునేలా సినిమా పేర్లకు ముందు స్పెషల్ థ్యాంక్స్ టు పవన్ అంటూ ‘గోపాల గోపాల’లోని పవన్ కొత్త ఫొటోను చూపించాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. పిల్లాడు భక్తిని బాగానే చాటుకుంటున్నాడు అనుకున్నారు. అయితే సినిమా సెకండ్ ఆఫ్ లో పబ్ సీన్ లో పవన్ సినిమాల్లోని ఓ పాట ఉంటుంది. దీనికి గే వ్యక్తులతో కలిసి నితిన్ డాన్స్ చేశాడు. సినిమాలో పవన్ పేరు వాడుకుంటే పర్లేదులే ఫ్యాన్ కదా అనకుకున్నారు. కానీ ఇలా పాటను వాడుకుని అవమానించటం ఏమిటని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యాన్ ముసుగులో నితిన్ హద్దుమీరి ప్రవర్తించాడు అని పవర్ స్టార్ అభిమానులు మండిపడుతున్నారు. అయితే ఇక్కడే మరోవర్గం నితిన్ తప్పేమి చేయలేదని వెనకేసుకు వస్తోంది. పవన్ పై అభిమానంతో పాటను పెట్టారు తప్ప.., గే వ్యక్తులతో అవమానించాలని కాదు అని వివరణ ఇస్తున్నారు. ఒక వర్గం అభిమానులు కూడా సినిమాను ఎంజాయ్ చేయాలి తప్ప.., ఇలా ప్రతి విషయాన్ని నెగెటివ్ గా పాయింట్ ఔట్ చేయవద్దని సూచిస్తున్నారు. ఫ్యాన్స్ ఎలా మాట్లాడుతున్నా.., దీనిపై పవర్ స్టార్ ఏమంటారో తెలియాల్సి ఉంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chinnadana neekosam updates  pawan kalyan latest  hero nithin on pawan  

Other Articles