Varun tej mukunda team starts promotions songs get hit talk

mukunda movie release, mukunda movie promotions, mukunda movie tickets, mukunda latest updates, mukunda movie trailers teaser, mukunda movie varun tej photos, tollywood latest news updates

varun tej mukunda team starts promotions : mega prince varun tej debut mukunda all set to release on 24th december, movie unit starts promotion programme to heat up the fans about movie and to get good collections

వాటితోనే క్రేజ్ పెంచుకుంటున్న వరుణ్

Posted: 12/23/2014 08:31 AM IST
Varun tej mukunda team starts promotions songs get hit talk

సినిమా ఆడాలి అంటే అందులో ఏదో ఒక హైలైట్ ఉండాలి. అప్పుడే మూవీ నడుస్తుందన్న నమ్మకం ఏర్పడుతుంది. ‘ముకుంద’కు అప్పుడే ఈ టాక్ వచ్చేసింది. సినిమాలోని పాటలు చాలా బాగున్నాయని టాక్ విన్పిస్తోంది. పాటల వల్లే సినిమాపై క్రేజ్ పెరుగుతోందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. మిక్కీజే మేయర్ అందించిన సంగీతంతో పాటు.., సరస్వతీ పుత్రుడు సిరివెన్నెల సీతారామశాస్ర్తి అందించిన లిరిక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందువల్లే సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొందని చెప్తున్నారు.

మరోవైపు ‘ముకుంద’ హీట్ ను మరింత పెంచేందుకు మూవీ యూనిట్ ప్రమోషన్ మొదలు పెట్టింది. వరుణ్ తేజ్, పూజా హెగ్డే సహా మిగతా వారంతా మీడియాతో ఇంటర్య్వూ, చిట్ చాట్ అంటూ ప్రజలకు దగ్గరవుతున్నారు. అటు టీవీ, ఔట్ డోర్ ప్రకటనలు కూడా పెంచారు. దీంతో వీరు ఆశించిన రిజల్ట్ వస్తోందట. నగరాల్లోని మల్టీ ప్లెక్స్ లలో ‘ముకుంద’ మూవీ టికెట్లు సోమవారం రోజు ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేటస్ చూపించాయి. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తొలి సినిమాతోనే వరుణ్ ప్రిన్స్ అనిపించుకుంటాడని చెప్తున్నారు.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల తీస్తున్న ఫ్యామిలి ఓరియంటెడ్ మెసేజ్ మూవీ ‘ముకుంద’. వరుణ్ తేజ్ తొలి చిత్రంగా వస్తున్న ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు సంయుక్తంగా సినిమాను నిర్మించారు. యు/ఎ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mukunda movie  varun tej promotions  tollywood latest  

Other Articles