హీరోగా మొదటి సినిమా కొబ్బరికాయ కొట్టక ముందే వాణిజ్య ప్రకటనల్లో నటించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు అక్కినేని అఖిల్. ఇటివలే వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ తొలి సినిమా ముహూర్త కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమా కోసం అఖిల్ చాలా రోజుల నుండి ప్రిపేర్ అవుతున్నాడు. అయితే తన తొలి చిత్రంలో హీరోయిన్ ఎవరన్న విషయమై సర్వత్రా అసక్తి నెలకొంది. శ్రీదేవి కూతురు జాహ్నవి దగ్గర నుంచి ఆలియాభట్, రాశిఖన్నా, అవికాగోర్ లాంటి ఎంతోమంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే అఖిల్ సరసన కొత్త హీరోయిన్ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అఖిలే స్వయంగా తెలిపాడు
సినిమా ముందు ప్రిపరేషన్ గురించి అఖిల్ మాట్లాడుతూ.. తాను స్వియ డ్యాన్సర్ని కాదన్నారు. ప్రస్తత యువ హీరోలందరూ అద్బుతంగా డాన్స్ చేస్తున్నారు. వారికి తగ్గకుండా డ్యాన్స్ చేయడానికి, వారి పోటి తట్టుకోవడానికి గత ఐదేళ్ళ నుండి నేర్చుకుంటున్నానన్నారు. కానీ ఇప్పుడు తాను డాన్స్ బాగానే చేయగాలుతున్నాన్నాడు. అలాగే తెలుగు మాట్లాడటం బాగా నేర్చుకున్నాన్నారు. ఐదేళ్ళ క్రితం వరకూ తెలుగు రాయటం, చదవటం వచ్చినా సరిగా మాట్లాడలేకపోయేవాడిని. తన తెలుగు ఉచ్చారణ మేరుగవ్వడం కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఒక డబ్బింగ్ థియేటర్ లో విభిన్న పాత్రలకు డబ్బింగ్ చెబుతూ ప్రాక్టీస్ చేశానని అఖిల్ చెప్పారు. మరీ ఇంతకీ ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరో సరసన నటించే అవకాశం ఎవరికి దక్కబోతుందో..వేచి చూడాలి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more