Geethanjali movie sequel shooting 2015

geethanjali sequel movie shooting, geethanjali sequel heroine, geethanjali sequel cast and crew, geethanjali sequel latest updates, anjali in geethanjali sequel, anjali movies latest updates, tollywood latest updates, 2014 telugu movies, 2015 telugu movies

geethanjali movie sequel shooting 2015 : anjali acted hit movie geethanjali again coming to audienc with a sequel moive shooting will start in 2015, raj kian directed geethanjali movie will start shooting part in 2015 first half more results awaited

భయపెట్టడం వచ్చే ఏడాది మొదలెడతారట !

Posted: 12/20/2014 02:52 PM IST
Geethanjali movie sequel shooting 2015

రొటీన్ లవ్, యాక్షన్ సినిమాల మద్యలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా ‘గీతాంజలి’ సీక్వెల్ రూపొందించే పనిలో డైరెక్టర్ బిజీగా ఉన్నారు. ‘కాంచన’, ‘ప్రేమ కథాచిత్రం’ మాదిరిగా కామెడి హర్రర్ సినిమాగా వచ్చిన ‘గీతాంజలి’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అనుకోకుండా ఈ సినిమా విజయం సాధించటంతో సీక్వెల్ తీసి క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమా హిట్ ను ఎంజాయ్ చేస్తున్న మూవీ యూనిట్.., వచ్చే ఏడాదిలో సీక్వెల్ పనులు మొదలు పెడుతుందట.

సంక్రాంతి తర్వాత గీతాంజలి సీక్వెల్ షూటింగ్ ప్రారంభం అవతుందని మూవీ యూనిట్ వర్గాలు తెలిపాయి. రాజ్ కిరణ్ తెరకెక్కించే ఈ సినిమాను క్రేజి మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మించనున్నాడు. వెలిగొండ శ్రీనివాస్ మాటలు అందిస్తున్న ఈ సీక్వెల్ లో అంజలి నటించటం లేదన్న విషయం తెలిసిందే. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను వెతకటంతో పాటు మిగతా పాత్రలను ఫైనలైజ్ చేసే పనిలో సినిమా యూనిట్ బిజీగా ఉంది. సీక్వెల్ సినిమా కూడా ‘గీతాంజలి’లాగే అందంగా భయపెడుతుందా.., లేక కొత్తదనం చూపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : geethanjali sequel  anjali latest updates  tollywood latest  

Other Articles