Anushka shetty recieves admires from co actresses

south indian actress anushka shetty, actress anushka shetty, actress anushka shetty news, anushka shetty updates, anushka shetty latest updates, anushka shetty vaarthalu

anushka shetty recieves admires from co actresses

స్టార్ హీరోయిన్ అన్న ఫీలింగ్ అనుష్కలో లేదట..

Posted: 12/13/2014 07:53 AM IST
Anushka shetty recieves admires from co actresses

ఎదిగే కొద్దీ ఒదిగి వుండాలన్న జీవిత సత్యాన్ని తెలుసుకుని మసులుతున్న దక్షిణాధి టాప్ హీరోయిన్ అనుష్క. ఈ తరం కుర్ర హీరోయిన్ల కన్నా సీనియర్ అయి వుండి కూడా వారితో పోటీ పడుతూ ప్రతిభలో తన నట విశ్వరూపాన్ని చూపుతున్న అమ్మడు.. ఈ మధ్య అందరు హీరోయిన్లతో ప్రశంసలు అందుకుంటోంది. అది ఆప్ ది స్ర్కీన్ లో... అంటే నమ్మగలరా..? కానీ నిజం. ఈ మధ్య తన సహచరి నటీమణుల ప్రశంసలను అందుకోంటోంది. తన కెరీర్‌లోఎవరితోనూ గొడవపడ్డ దాఖలాలు లేని అనుష్క.. ‘లింగ’లో సోనాక్షీ సిన్హా పాత్ర కాస్త డామినేటింగ్‌గా ఉన్నా, ‘ఎంతవాడు గాని’ చిత్రంలో త్రిష పాత్ర కథలో కీలమైనదైనా... తను మాత్రం ఆ విషయాలను తేలిగ్గా తీసుకున్నారట.

 పైగా తోటి హీరోయిన్లతో ఆమె నడుచుకునే  తీరు, అందర్నీ ఆశ్చర్యానికి లోను చేస్తోందని టాక్. టాప్ హీరోయిన్ అయ్యుండి కూడా ‘ఎంతవాడు గాని’ సెట్‌లో మలయాళ నటి పార్వతీ నాయర్‌ని ఎంతో గౌరవిస్తున్నారట అనుష్క. సెట్‌లో ఆమె పుట్టిన రోజును స్వయంగా అనుష్కే ఘనంగా నిర్వహించారట. అనుష్కను ఇంతకు ముందు ఎప్పుడు కలవలేదు. కలిశాక...ఆమెలోని సింప్లిసిటీ చూసి షాక్ అయ్యాను అంటోంది పార్వతి నాయర్. తానోక స్టార్ హీరోయిన్‌ననే ఫీలింగే అనుష్కలో కనిపించదు. సెట్‌లో ఆమె నా పుట్టిన రోజుని జరిపిన తీరును నేనెప్పటికీ మరిచిపోను. పర్‌ఫెక్ట్ సౌతిండియన్ లుక్‌తో ఉంటారు కాబట్టే దక్షిణాదిన సూపర్‌స్టార్ కాగలిగారు అంటూ అనుష్కను పొగడ్తల్లో ముంచేశారు పార్వతి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles