Comedian vennela kishore ends director life

vennela kishore direction movies, vennela kishore movies, vennela kishore coemdy movies, tollywood latest news updates, telugu comedy movies, telangana actors list, telugu comedians updates, telugu latest news updates

comedian vennela kishore ends director life : comedian cum director vennela kishore decides to act in movies but dont try direction in future, vennela kishore failed with own direction movies so that he decides to not direct

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది కిషోరా...

Posted: 12/06/2014 04:21 PM IST
Comedian vennela kishore ends director life

అనుకున్నదొక్కటి., అయినది ఒక్కటి అని అలనాటి సినిమాలో వచ్చిన పాట చాలామంది జీవితాల్లో నిజంగానే జరుగుతుంది. ఏదో చేయాలని.., సాధించాలని కలతో కష్టపడితే అది ఫలించదు. కాని అనుకోకుండా.., సరదాకు చేసిన పనులు సూపర్ హిట్ అయి కలల్ని డామినేట్ చేస్తాయి. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా అలానే బాధపడుతున్నాడు. ‘వెన్నెల’సినిమాతో వెలిగిన కిశోర్ ఈ మద్య ప్రతి సినిమాలో కన్పిస్తున్నాడు. తడబడే ముఖ హావభావాలు, దొరికిపోయామే అనే ఫీలింగ్ స్పష్టంగా కన్పించే కిషోర్ ను అందరూ వాడుకుంటున్నారు. అందుకు తగ్గట్టు రెమ్యునరేషన్లు కూడా ఇస్తున్నారనుకొండి.

ఈ స్టార్ కమెడియన్ అసలు కోరిక డైరెక్టర్ కావాలని. తన తహతహ తీర్చుకోవటానికి వెన్నెలను తలదన్నేలా తీయాలని ‘వెన్నెల 1 1/2’ తీస్తే చీకట్లను మిగిల్చింది. ఆ తర్వాత బ్రహ్మానందంతో ‘జఫ్పా’ తీస్తే అది పేరుకు తగ్గట్టే కలెక్షన్లు వసూలు చేసుకొచ్చింది. డైరెక్టర్ గా రెండు పరాభవాలు ఎదురుకావటంతో మళ్లీ కమెడియన్ బాట పట్టి క్లిక్ అయ్యాడు. వరసగా సినిమా చాన్సులు వస్తుండటంతో నవ్వుకోవటానిక వీల్లేనంతగా బిజీ కమెడియన్ గా మారాడు. అనుకోకుండా ఇలా కమెడియన్ కావటంతో కెరీర్ ను నవ్వులతోనే కొనసాగించాలని ఫిక్స్ అయి డైరెక్టర్ మెగా ఫోన్ పక్కనపెట్టేశాడు. ఇకపై సినిమాలు డైరెక్ట్ చేయనని చెప్పేశాడు.

ఇలా అనుకోకుండా కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోలు అయిన వారు చాలామంది ఉన్నారు. వారిలో కొందర్ని చూస్తే..., హీరో కమెడియన్ కావాలని రాలేదు.., కానీ అయ్యాడు. హీరో అవుదామనుకోలేదు, అలా సెట్ అయిపోయింది. అదేబాటలో హీరో నాని కూడా మొదట బాపు దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడు. ఇక పోసాని కృష్ణమురళి కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసినా ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టు ఆఫర్లు వస్తుండటంతో అలా కొనసాగుతున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వీరి లిస్ట్ లో తాజాగా వెన్నెల కిశోర్ జతచేరాడు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vennela kishore movies  vennela 1 1/2 movie  telugu comedians  

Other Articles