Pawan kalyan venkatesh multistarrer gopala gopala shooting completed

gopala gopala shooting completed, gopala gopala shooting updates, gopala gopala pawan kalyan photos, gopala gopala latest photos teaser, gopala gopala release date, gopala gopala venkatesh photos, pawan kalyan latest updates, venkatesh movie latest updates, tollywood movies latest updates

pawan kalyan venkatesh multistarrer gopala gopala shooting completed : pawan kalyan and venkatesh combination multistarrer movie gopala gopala shooting completed on 5th december in varanasi

‘గోపాల గోపాల’ షూటింగ్ కు శుభం కార్డ్

Posted: 12/06/2014 10:50 AM IST
Pawan kalyan venkatesh multistarrer gopala gopala shooting completed

టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ‘గోపాల గోపాల’ మూవీ గురించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం.., ఈ సినిమా షూటింగ్ పనులన్ని పూర్తి చేసుకుంది. ముఖ్యమైన సన్నివేశాల షూటింగ్ కోసం వారణాసి వెళ్ళిన మూవీ యూనిట్, శుక్రవారం సాయంత్రం అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీంతో సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయినట్లే. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరగనున్నాయి. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న మూవీ యూనిట్ ఇందుకోసం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది.

కార్మికుల సమ్మె ప్రభావం ‘గోపాల గోపాల’కు కూడా ఉంటుందని ఆందోళన వ్యక్తం అయింది. అయితే ఇతర రాష్ర్టాల్లోని సినిమాల షూటింగులకు సమ్మె నుంచి మినహాయింపు ఉండటంతొ వారణాసి షూటింగ్ కు ఏ ఇబ్బంది రాలేదు. అనుకున్నట్లుగా టైమ్ కు షూటింగ్ పూర్తి కావటంతో.., సినిమా విడుదల కూడా సరైన సమయానికి జరుగుతుందని డైరెక్టర్ డాలి ఆశిస్తున్నారు. ఈ మద్య విడుదల అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు మంచి స్పందన రాగా.., ఈ నెలలో ఆడియో విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు.

హిందీ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాఢ్’ తెలుగు రీమేక్ గా ‘గోపాల గోపాల’ వస్తోంది. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను కిశోర్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు, శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోవటంతో, అనూప్ రూబెన్స్ అందించే సంగీతం హైలైట్ అవుతుందని ముందే అంచనా వేస్తున్నారు. వెంకటేష్ భార్యగా, శ్రీకృష్ణుడి భక్తురాలిగా శ్రియ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopala gopala shooting  pawan kalyan first look  venkatesh latest update  

Other Articles