Virkam vijay milton second movie

vikram vijay milton movie, vikram vijay milton second movie, vikram i movie release updates, enradhukulla movie updates, i movie latest photos trailer, tollywood latest news updates, koliwood latest news updates

virkam vijay milton second movie : tamil super hero vikram completed a his first movie with vijay milton during the movie schedule vikram signs next movie with vijay

ఇది విక్రమ్ మంచితనమా.. అమాయకత్వమా..?

Posted: 12/06/2014 09:10 AM IST
Virkam vijay milton second movie

తమిళ ఇండస్ర్టీలో చియాన్ విక్రమ్ కు చాలా మంచి పేరుంది. సినిమాలు తీయటంతో పాటు, వ్యక్తిత్వ పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన నటించిన ‘ఐ’ మూవీ విడుదల కోసం సిద్ధమవుతోంది. ఈ లోపు విజయ్ మిల్టన్ తో కలిసి ‘10 ఎండ్రదుకుళ్ళ’ అనే సినిమా తీస్తున్నాడు. అతి తక్కువ కాలంలో వేగంగా షూటింగ్ చేయటంతో ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక తాజా అప్ డేట్ ఏమిటంటే.. విక్రమ్ విజయ్ దర్శకత్వంలోనే మరో సినమిా చేస్తాడని తెలుస్తోంది. చియాన్ తర్వాతి సినిమా డేట్లు కూడా విజయ్ మిల్టన్ కు ఇచ్చేశాడని టాలీవుడ్ లో టాక్ విన్పిస్తోంది.

విజయ్ మిల్టన్ పనితీరు నచ్చటంతో తదుపరి చాన్స్ కూడా ఆయనకే ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. విజయ్ పనితీరు, స్ర్కిప్టు బాగా నచ్చటంతో మెచ్చి రెండవ చాన్స్ ఇస్తున్నాడని అంటున్నారు. 2015 ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటించింది. కొత్త డైరెక్టర్ ను నమ్మి.., ఒక సినిమా పూర్తి కాకముందే రెండవ సినిమా ఛాన్స్ ఇవ్వటం అంటే అది ధైర్యంతో పాటు మంచితనం కూడా అవుతుందని విక్రమ్ సన్నిహితులు అంటున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విక్రమ్ తాజా మూవీ ‘ఐ’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ముందుగా దీపావళికి సినిమా విడుదల అవుతుందనుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ లో వస్తుందనుకున్నా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదు. చివరకు సంక్రాంతికి విడుదల అంటున్నారు. అయితే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వల్ల పండగకు కూడా రాకపోవచ్చు అని టాక్ విన్పిస్తోంది. సంక్రాంతికి రాకపోతే ఇక పిబ్రవరిలోనే ఈ మూవి విడుదల ఉంటుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : vikram  vijay  enradhukulla  koliwood  

Other Articles