Sridevi daughter jhanvi kapoor in akkineni akhil debut

akkineni akhil first movie updates, akkineni akhil latest photos, akkineni akhil debut, akkineni akhil jahnavi movie update, sridevi daughter in akhil movie, jahnavi kapoor in akkineni akhil movie, akkineni akhil vv vinayak movie update, jahnavi kapoor movies updates, jahnavi kapoor telugu movies, tollywood latest updates

sridevi daughter Jhanvi Kapoor in akkineni akhil debut : we all know soon akkineni akhil first movie will start shooting soon in vv vinayak direction. here is a fresh buzz that akkineni akhil debut movie heroine is sridevi daughter she is jahnavi kapoor. but official confirmation awaited

తల్లీకుతూళ్లను పంచుకున్న తండ్రి కొడుకులు

Posted: 11/19/2014 05:55 PM IST
Sridevi daughter jhanvi kapoor in akkineni akhil debut

టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాదు భారత సిని ఇండస్ర్డీలో అతిలోక సుందరి అనగానే గుర్తుకువచ్చేది శ్రీదేవి. కూతురు సినిమాలు తీసే వయసుకు వచ్చినా ఈమెలో మాత్రం ఇంకా అందం తరగలేదు. చెరగని శిల్పంలా చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ఇక ఆమె వారసత్వంగా వచ్చిన జాహ్నవి కూడా శ్రీదేవిని మరిపిస్తోందని వార్తలు విన్పిస్తున్నాయి. ఈ అమ్మడు త్వరలోనే టాలీవుడ్ లో తెరంగేట్రం చేయనుంది. టాలీవుడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం.., అక్కినేని అఖిల్ తొలి సినిమాలో శ్రీదేవి కూతురు జాహ్నవి నటిస్తుందని తెలుస్తోంది.

త్వరలోనే షూటింగ్ మొదలయ్యే ఈ సినిమా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.., జాహ్నవిని, అఖిల్ తో కలిపి ఇండస్ర్టికి పరిచయం చేస్తారట. ఇందుకోసం శ్రీదేవితో నాగార్జున చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొత్త హీరోయిన్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు శ్రీదేవి కూతురుగా హీరోయిన్ ముద్రపడి, ఇంకా సినిమాలు మొదలుపెట్టని జాను.., ఇందుకు ఒప్పుకుంటుందని తెలుస్తోంది. మూవీ చేయకముందే స్టార్ హీరో క్రేజ్ సంపాదించిన అఖిల్ తో సినిమా చేస్తే త్వరగా ప్రజలకు చేరువకావచ్చని.., ఇది తన ఫ్యూచర్ కు చాలా ఉపయోగపడుతుందని శ్రీదేవి కుటుంబం కూడా ఆలోచిస్తోంది. అయితే ఈ మూవీలో జాహ్నవి నటించటంపై అయితే సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గతంలో నాగ చైతన్యను ఇండస్ర్టీకి పరిచయం చేసిన సినిమా ‘జోష్’ లో కూడా రాధ కూతురు కార్తికను హీరోయిన్ గా పరిచయం చేశారు. ఇదే సెంటిమెంట్ తాజాగా అఖిల్ కు ప్రయోగిస్తున్నట్లు అక్కినేని ఫ్యామిలీ సన్నిహితుల సమాచారం. ఇలా ఫ్రెస్ ఎంట్రీ కోసం ఫ్రెష్ హీరోయిన్ కావాలని తండ్రి తపనపడుతున్నాడు. శ్రీదేవి హీరోయిన్ గా చేసిన సమయంలో.., ఆయన సరసన ‘గోవిందా గోవిందా’ సహా ఇతర సినిమాల్లో శ్రీదేవి నటించింది. ప్రస్తుతం నాగ్ కొడుకు సినిమాలో ఆమె కూతురు జాహ్నవి నటించనుంది. అంటే అప్పుడు తల్లి నాగ్ తో కలిసి రొమాన్స్ చేస్తే.., ఇప్పుడు కూతురు అఖిల్ తో కలిసి ఆడిపాడనుందన్నమాట. వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో త్వరలోనే తేలిపోనుంది. ఈ మూవీకి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అన్ని కుదిరితే వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni akhil  jahnavi kapoor  tollywood  vv vinayak  debut  latest news  

Other Articles