Hansika latest interview actresses film industry life personal incidents

hansika motwani, hansika motwani latest news, hansika latest news, hansika hot photo shoot, hansika latest gallery, hansika movies, hansika wikipedia, hansika wiki, hansika love affairs, hansika gossips, hansika personal photos, telugu news, tollywood news

hansika latest interview actresses film industry life personal incidents

ఆ లోటు బాధించలేదు.. సంతృప్తిగా వున్నా..

Posted: 11/10/2014 10:56 AM IST
Hansika latest interview actresses film industry life personal incidents

చిత్రపరిశ్రమలో హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వుంటుంది.. అలాగే స్టార్ హోదాను దక్కించుకోవాలంటే ఇంకా ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తోంది. వ్యక్తిగత జీవితం, ఇష్టాలు, కుటుంబసభ్యులు, ఫ్రీడమ్, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం... ఇలా అన్నింటినీ ఖచ్చితంగా వదులుకోవాల్సి వస్తుంది. అప్పుడే పరిశ్రమలో అనుకున్న స్థాయికి చేరుకోగలరు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వాదనలు కూడా ఇలాగే వున్నాయి. తెరపైన తాము ఏ విధంగా అయితే నవ్వుతూ కనిపిస్తారో.. తెరవెనుక అన్నే కష్టాలను అనుభవించాల్సి వస్తోందని అందరి ఆవేదన! ఇతరుల సంగతేమోగానీ.. హన్సిక మాత్రం ఇలాగే చెప్పుకొస్తోంది.

ఇటీవల ‘పవర్’ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో హన్సిక దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. మొన్నటివరకు సైలెంటుగా వున్న ఈ బొద్దుగుమ్మ.. ఇప్పుడు సంతోషంగా ఎక్కడబడితే అక్కడ ప్రెస్ మీట్ లు ఇచ్చుకుంటూ వార్తల్లో నిలిచిపోతోంది. ఈ నేపథ్యంలోనే తన సినిమా జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇందులోభాగంగానే హన్సిక మాట్లాడుతూ.. ‘‘స్టార్ హోదా అంతా ఈజీగా రాదు. ఎన్నో త్యాగాలు చేయాలి.. వ్యక్తిగత జీవితం, ఇష్టాలూ పక్కన పెట్టాలి. నేను వీటన్నింటికీ సిద్ధపడే రంగంలోకి వచ్చాను. ఇవన్నీ ఎందుకు కోల్పోయానా..? అని ఎప్పుడూ బాధపడలేదు. నేను సాధించిన విజయాలతో సంతృప్తి వున్నాను’’ అంటోంది.

అలాగే ‘‘చిన్నప్పుడే కెమెరా ముందుకొచ్చాను. దాంతో కాలేజీ జీవితం ఆస్వాదించలేకపోయాను. సినిమాల్లో చాలాసార్లు పుస్తకాలు పట్టుకొని కాలేజీకి వెళ్లా.. అయితే ఒకట్రెండు సన్నివేశాలకే పరిమితమయ్యాను. అయితే ఎప్పుడూ కాలేజీ రోజుల్ని మిస్ అయ్యానన్న ఆలోచన రాలేదు. ఎందుకంటే సినిమానే నా లోకం అయిపోయింది. మరో ఆలోచనకీ సమయం వుండటం లేదు. కూతురుగా, ప్రియురాలిగా, విద్యార్థిగా, డాక్టర్ గా ఎన్నో పాత్రల్లో నటించే అవకాశం నాకు సినిమాలు కల్పిస్తున్నాయి. కాబట్టి.. ఇన్నాళ్లూ వ్యక్తిగతంగా కోల్పోయినవన్నీ సినిమాలోకం ఆ లోటు రానివ్వడంలేదు. నేను సంతోషంగానే వున్నా’’నని చెబుతోంది హన్సిక!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hansika motwani  actresses interview  tollywood news  telugu news  

Other Articles