Ntr gives dates to dil raju

ntr next movie with dil raju, ntr next movie, ntr movie with bommarillu bhaskar, ntr puri jagannath movie, tollywood latest news

ntr gives dates to dil raju : junior ntr gives dates to act in dil raju producing movie and this will start before completion of puri jagannath present movie. junior ntr latest movie will be with bommarillu bhaskar in dilraju production

ఒక హిట్, ఒక ఫ్లాప్ కలిస్తే ఎన్టీఆర్ మూవీ

Posted: 11/07/2014 04:11 PM IST
Ntr gives dates to dil raju

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తీస్తున్న సినిమా ఇంకా పూర్తి కానేలేదు. అప్పుడే మరో సినిమాకు సంతకం చేశాడు. అంతేకాదు, తారక్ కూడా డేట్లు ఇచ్చేశాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకున్న సమాచారం ప్రకారం జూనియర్ కొత్త సినిమాను దిల్ రాజు నిర్మిస్తాడట. గతంలో ‘రామయ్యా వస్తావయ్యా’ ఫ్లాప్ కావటంతో దిల్ రాజు బాగానే నష్టపోయాడని అనుకున్నారు. అందుకే మరోసారి ఛాన్స్ అడగ్గానే సింపథీ వర్కవుట్ అయి వెంటనే ఒప్పేసుకున్నాడని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తాడని తెలుస్తోంది. గతంలో రాజు - భాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన ‘బొమ్మరిల్లు’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందుకే ఈ కాంబినేషన్ లో సినిమా అంటే బాగుంటుంది అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇక రామయ్యా వస్తావయ్యా ఫ్లాపు నిర్మాత, బొమ్మరిల్లు హిట్ డైరెక్టర్ తో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే. అయితే ఈ మూవీలో హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయలేదు అని తెలుస్తోంది.

ఇక ఈ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం అవుతుందట. అంటే పూరితో సినిమా పూర్తవగానే ఎన్టీఆర్ భాస్కర్ సెట్ లోకి వస్తాడని చెప్తున్నారు. ఇందుకోసం డైరెక్టర్ కధను పట్టుకుని బాగా మెరుగులు దిద్దుతున్నాడు. ఫ్యామిలి, ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు తీసి హిట్ కొట్టిన భాస్కర్, మాస్ ఇమేజ్ ఉన్న హీరోను కొత్తగా ఎలా చూపిస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ntr  dil raju  puri jagannath  bommarillu bhaskar  

Other Articles