Samantha comments on pawankalyan and mahesh babu

samantha wiki, samantha latest photos, samantha latest movies, samantha hot, samantha hot photos, samantha latest hot photos, samantha upcoming movies, samantha telugu movies, samantha comments, samantha on pawan kalyan, samantha on mahesh babu, samantha comments on ntr, samantha comments on naga chaitanya, latest updates, tollywood latest updates, latest telugu movie gossips, tollywood

actress samantha again showed her tongue alergy on tollywood heros by downfalling pawan kalyan and mahesh babu : samantha latest comments on pawan kalyan and mahesh babu and says that she likes to act with nagachaitanya

నేను.. నా పైత్యం ! మహేష్, పవన్ పై సమంత కామెంట్లు

Posted: 10/14/2014 03:46 PM IST
Samantha comments on pawankalyan and mahesh babu

‘తల దాచుకొమ్మని పిలిస్తే.., తన్ని బయటకు పంపినట్లుంది’ సమంత యవ్వారం. చెన్నై నుంచి వచ్చినా.., చక్కగా ఉండటంతో సినిమాల ఆఫర్లు ఇస్తే నెత్తికెక్కి కూర్చుంది. హిట్ కొట్టిన హీరోలపై కామెంట్లు చేస్తూ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. ఆమద్య ‘1నేనొక్కడినే’ సినిమాపై ట్విట్టర్ లో కామెంట్లు చేసి వివాదానికి కారణం అయిన సమంత మరోసారి మహేష్ ను టార్గెట్ చేసింది. దీనికి తోడు ఈ సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కలిపేసి కామెంట్లు చేసింది.

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కంటే తనకు నాగ చైతన్యతో కలిసి నటించటం అంటేనే ఇష్టమని తెలిపింది. ఇందుకు కారణం ఈ ముద్దుగుమ్మ తొలి తెలుగు సినిమా ‘ఏం మాయ చేశావే’ చైతుతో కలిసి నటించటమే కావచ్చు. తొలి మూవీ అది కూడా హిట్ కావటంతో మంచి అభిప్రాయం ఉండవచ్చు కాని అదే సమయంలో బిగ్ హిట్లు ఇచ్చిన పవన్, మహేష్ వంటి స్టార్లను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. మహేష్ తో ‘దూకుడు’, పవన్ తో ‘అత్తారింటికి దారేది’ రెండూ మంచి హిట్ సినిమాలే. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను అమాంతం పైకి ఎత్తేసింది. తారక్ మంచి డాన్సర్ అని ప్రశంసించింది. నందమూరి ‘బృందావనం’, ‘రామయ్య వస్తావయ్యా’, ‘రభస’ సినిమాల్లో నటించింది.  

గతంలో శృతి హాసన్, అమలాపాల్ మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కామెంట్ల పైత్యం బయట పెట్టింది సమంత. హీరోలు, హీరోయిన్లపై వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవచ్చు, అవి బయటకు చెప్పే స్వేచ్చ అందరికి ఉంది. కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ట్విట్టర్ అకౌంట్ ఉంది కదా అని కామెంట్ చేస్తే... మైకు కన్పించింది కదా అని మాట్లాడితే ఇబ్బందులు తప్పవు అని గతంలోనే ఓ సారి నిరూపితమైంది. అయితే వాటి నుంచి పాఠాలు నేర్చుకోకుండా మళ్లీ కామెంట్లు చేస్తే కెరీర్ కే ఇబ్బంది అని సినిమా ప్రముఖులు అంటున్నారు. తాజా కామెంట్లపై మహేష్, పవన్ ఫ్యాన్స్ ఏమంటారో చూడాలి. అటు చెన్నై చిన్నదాని కామెంట్లపై స్టార్ హీరోలు స్పందిస్తారా లేక లైట్ తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  pawan kalyan  mahesh babu  naga chaitanya  

Other Articles