కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన తాజా సినిమా ‘యమలీల2’ విడుదల వాయిదా పడటానికి చాలా కారణాలు విన్పిస్తున్నాయి. మొదట్లో ఈ సినిమా నిర్మాతకు ఫైనాన్స్ ఇబ్బందుల వల్ల సినిమా విడుదల ఆగిపోయిందని అంతా అనుకున్నారు. అటు ఫిలింనగర్ వర్గాలు కూడా ఇదే విషయం వెల్లడించాయి. కాని తాజాగా అదంతా అబద్దమని తెలుస్తోంది. ప్రొడ్యూసర్ కు ఎలాంటి ఫైనాన్స్ ఇబ్బందులు లేవట. మరి ఎందుకు ఆగిపోయింది అంటే స్పెషల్ ఎఫెక్ట్ కోసమని చెప్తున్నారు.
సోషియో ఫాంటసీ సినిమాగా వస్తున్న ‘యమలీల2’ సినిమా కధకు తగ్గట్టుగా గ్రాఫిక్స్ వర్క్ ప్రస్తుతం జరుగుతుందట. ఈ వర్క్ విషయంలో సినిమా వర్గాలు ఎక్కడా తగ్గటం లేదని టాక్ వస్తోంది. అందువల్లే అన్ని ఎఫెక్టులు ప్రయోగించి పర్ ఫెక్ట్ గా బొమ్మ పడేందుకు కాస్త సమయం పడుతోంది అని చెప్తున్నారు. క్వాలిటి బాగుంటే కలెక్షన్లు కూడా బాగుంటాయని వీరంతా నమ్ముతున్నారు. ఎటుపోనూ ప్రేమకధా సినిమా, పోలిస్ స్టోరి కాదు కాబట్టి ఎప్పుడు విడుదల చేసినా ఆడుతుంది అనే నమ్మకంతో నిదానమే ప్రధానం అనుకుంటున్నారు. అయితే ఇక్కడే ఆలస్యం అమృతం విషం అనే విషయం మర్చిపోవద్దని టాలీవుద్ ప్రముఖులు సూచిస్తున్నారు.
చాలా గ్యాప్ తర్వాత కుటుంబ కధా చిత్రాల దర్శకుడు ఎస్.వీ. కృష్ణారెడ్డి ‘యమలీల 2’ను డైరెక్ట్ చేస్తున్నారు. తొలి సిరీస్ లో సత్యనారాయణ యముడి పాత్రలో నటిస్తే.., ఇందులో మోహన్ బాబు యముడిగా మెప్పిస్తారని ఫిలింనగర్ లో గుసగుసలు వస్తున్నాయి. క్రిష్వీ ఫిలింస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో కె.వి. సతీష్ హీరోగా నటిస్తున్నాడు. అంతేకాదు ఆయనే నిర్మాత కూడా. అందుకే యముడి వద్ద తనను తాను మంచిగా చూపించుకోవటం కోసం డబ్బు, క్వాలిటీ విషయంలో తగ్గటంలేదని గుసగుసలు వస్తున్నాయి. అటు డైరెక్టర్ కూడా మంచి సినిమా చేశాము అన్పించుకోవటం కోసం కాస్త లేట్ అయినా లేటెస్టుగా వద్దాము అన్నట్లుగా గ్రాపిక్స్ కోసం ఆగుతున్నాడు. చూడాలి మరి ఎప్పుడు రెండవ యముడు బయటకు వస్తాడో..?
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more