Priyamani to marry a cinematographer from kerala

priyamani, priyamani hot, priyamani latest, priyamani wiki, priyamani movies, priyamani latest movies, priyamani marriage, priyamani latest hot photos, priyamani bikini, kerala, kerala beauties, heroines marraige, cinematographer, cinematography, latest news, tollywood, bollywood, maliwood, koliwood

heroine priyamani marriage set with a cinematographer from kerala : actress priyamani announced her marriage news going to share life with a cinematographer from kerala

ప్రియమణికి పెళ్ళి కుదిరింది

Posted: 09/30/2014 03:28 PM IST
Priyamani to marry a cinematographer from kerala

నటి ప్రియమణి త్వరలో పెళ్ళి పీటలు ఎక్కనుంది. కేరళకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తో త్వరలోనే పెళ్లి జరగనుంది. కొద్ది కాలంగా ప్రియకు సంబంధాలు చూస్తున్న కుటుంబ సభ్యులు వరుడి కోసం అనేక ప్రాంతాల్లో వెతికారు. కొంతమందిని పరిశీలించి పక్కనబెట్టారు. పెద్ద బిజినెస్ మెన్ కు ఇచ్చి చేయాలని అనుకున్నారు. కానీ చివరకు ఓ కెమెరామెన్ కు ఇచ్చి చేయాలని నిర్ణయించారు. ఇందుకు ప్రియ కూడా ఒకే చెప్పింది. దీనికి సంబంధించి ప్రియ కామెంట్ కూడా చేస్తోంది అదేమంటే.. పెద్ద బిజినెస్ మెన్ కు సెకండ్ వైఫ్ గా ఉండేకంటే సినిమాటో గ్రాఫర్ కు ఫస్ట్ వైఫ్ గా ఉండటం చాలా బెటర్ అని అంటోంది.

త్వరలోనే తన పెళ్ళికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని ఈ కన్నడ భామ అంటోంది. చాలామంది సినిమా హీరోయిన్లు బిజినెస్ మెన్ లతో పెళ్లిళ్ళు చేసుకుని వీలయితే కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. లేకపోతే  ఖాళీగా ఇంట్లో ఉంటున్నారు. కాని ప్రియ అలా కాకుండా సినిమా ఫీల్డ్ కు సంబంధించిన వ్యక్తితో మూడు ముళ్లు వేయించుకుంటోంది. దీంతో ఆమె సినిమాల్లోకి మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ మద్య ప్రియమణికి సినిమాలు కాస్త తగ్గాయి. కొత్త హీరోయిన్లు రావటంతో పాత అందాలను ప్రముఖులు పక్కనబెట్టేశారన్న టాక్ విన్పిస్తోంది.

‘ఎవరే అతగాడు’ సినిమాతో తెలుగులో కెరీర్ మొదలు పెట్టింది ప్రియమణి. ఆ తర్వాత తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించింది. తెలుగుల పాపులర్ సినిమాలు చెప్పాలంటే ‘పెళ్లయిన కొత్తలో’, ‘యమదొంగ’, ‘గోలిమార్’,  ‘ప్రవరాఖ్యుడు’, ‘రక్త చరిత్ర’ వంటి ముఖ్యమైన సినిమాలు చెప్పవచ్చు. తమిళంలో ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమాలో ఐటం సాంగ్ల లో కూడా నటించింది. తమిళంలో నటించిన ‘పరుత్తివీరన్’ ప్రియమణి కెరీర్ కు గొప్ప గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు, తమిళ్ విజయ్ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. కెరీర్ లో మొత్తం మూడు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకుంది. ప్రస్తుతం పెళ్లి పీటలు ఎక్కబోతున్న ప్రియమణి వైవాహిక జీవితం సుఖంగా సాగాలని తెలుగు విశేస్ కోరుకుంటోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cinematographer  priyamani  latest news  marriage  

Other Articles