Attarintiki daredi movie 365days completed

sharwanand, sharwanand movies, sharwanand next movie, sharwanand upcoming movies, sharwanand latest, chiranjeevi, malli malli idi rani roju, malli malli idi rani roju movie, chiranjeevi songs, telugu ever green songs, ever green telugu songs, chiranjeevi hit songs, ever green chiranjeevi songs, latest news, tollwood

pawan kalyan sensational hit attarintiki daredi movie succesfully completes 365days : power star pawan kalyan

అతనొక ఆకాశం.., అంతు ఎరుగని శూన్యం

Posted: 09/27/2014 04:24 PM IST
Attarintiki daredi movie 365days completed

పవన్ కళ్యాణ్ కెరీర్ లో అదో మైలు రాయి. సినిమా అంటే వినోదమే కాదు.. దాని వెనక ఎంత కష్టం ఉంటుందో ఆ సినిమా గురించి తెలిసిన వారిని అడిగితే చెప్తారు. కష్టాలు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తుంటే.., అన్నిటిని తట్టుకుని బాక్సాఫీస్ దారేది అంటూ వెతుక్కుంటూ వెళ్లింది. వెళ్లటమే కాదు.. అక్కడ తనకంటూ ఒక స్థానం క్రియేట్ చేసుకుని భవిష్యత్తుకు సవాల్ గా నిలిచింది. అదే ‘అత్తారింటికి దారేది’ సినిమా. ఈ ఆల్ టైం హిట్ సినిమా రిలీజ్ అయి ఇవాళ్టికి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సందర్బంగా అత్తారింటికి దారేది టీమ్ కు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా నిర్మాణం ‘‘విడుదల-వివాదాలు-విజయాలు’’ గురించి ఒకసారి చూద్దాం.

పవన్ కళ్యాణ్ కెరీర్ కు ఒక మైల్ స్టోన్ గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ సినిమా సక్సెస్ అంత ఈజీగా రాలేదు. ఎంతో కష్ట ఉంది.., అంతకు మించిన సమస్యలను అధిగమించిన మంచితనం.., ప్రేక్షకుల ఆదరణ కలిసి సినిమాను నిలబెట్టాయి. ‘జల్సా’ సినిమా తర్వాత కేవలం ‘గబ్బర్ సింగ్’ మాత్రమే హిట్ సాధించింది. దీంతో మరో హిట్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కు ‘అత్తారింటికి దారేది’ సినిమా అందివచ్చిన వరం అని చెప్పాలి. మంచి కధ, కధనం, డైలాగులు, డైరెక్షన్, పాటలు అన్ని సూపర్ హిట్.. ఇవన్నీ కలిపితే ‘అత్తారింటికి దారేది’ సినిమా. ప్రేమ కధా సినిమాల మోజులో పడి ఫ్యామిలి కధలు మర్చిపోతున్న రోజులివి. అలాంటి తరుణంలో కుటుంబమంతా సినిమా చూసేలా చేసింది ‘అత్తారింటికి దారేది’. ఈ సినిమాలో పవన్ ను చూస్తే.., మన ఇంటి అబ్బాయి అన్పించేలా నటించాడు కాదు కాదు జీవించాడు అని చెప్పటం కాస్త బాగుంటుంది.

ఈ సినిమాకు అనేక సవాళ్ళు ఎదురయ్యాయి. అందులో ప్రధానమైనది ‘పైరసీ’. సినిమా పరిశ్రమను పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారి ‘అత్తారింటికి దారేది’ పాలిట యమపాశంలా మారింది. చివరకు మాత్రం న్యాయమే గెలిచింది. విడుదల అయిన రోజే సినిమా పైరసీ సీడీలు మార్కెట్ లో లభ్యం అవుతుండగా.., ‘అత్తారింటికి దారేది’ విషయంలో మాత్రం ఒకడుగు ముందుకు వేసి.., విడుదలకు రెండు మూడు రోజుల ముందే.., సగం సినిమా భాగం సీడీలు బయటకు వచ్చాయి. కుట్రతోనో లేక.., తుంటరితనం వల్లో ఖచ్చితంగా తెలియదు కాని.. కొందరు చేసిన ఈ పని ఇండస్ర్టీకే సవాల్ విసిరింది. పైరసి బూతం పవర్ ఏంటో చాటింది. టాలీవుడ్ లోనే కాకుండా దేశ సినిమా పరిశ్రమలో సంచలనం కల్గించిన ఈ సీడీల కేసును పోలిసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టుచేశారు.

విడుదలకు ముందే సీడీలు బయటకు రావటంతో., కధను ముందే ఊహించి.. సినిమా ఆడదు అని ఊహాగానాలు వచ్చాయి. ఇక మరొక అడ్డంకి దేశాన్ని ప్రభావితం చేసిన తెలంగాణ అంశం. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో మెగా ఫ్యామిలి సినిమాలు గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాయి. ఈ సినిమాకు కూడా ఆ ప్రభావం తప్పదు అని అంతా అనుకున్నారు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు అయితే సీడీ విడుదల, తెలంగాణ వివాదం వల్ల ఈ సినిమాను కొనడానికి కూడా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో అనేక సవాళ్ళను ఎదుర్కుంటూ సినిమా విడుదల అయింది.

‘అత్తారింటికి దారేది’ విషయంలో తెలుగు ప్రజలు చూపిన ఆదరణ ఎప్పటికి మరువ లేనిది. సినిమా పైరసి బయట దొరుకుతున్నా.., కాదనుకుని థియేటర్లకు వచ్చి సినిమా చూశారు. చిత్రానికి విజయం అందించారు. ఉద్యమానికి కళలు, కళాకారులకు ప్రాంతీయ బేధాలు ఉండరాదని తెలంగాణ ప్రజలు కూడా సినిమాను ఆదరించారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థులు, నేతలు కూడా సినిమాను చూసి పవన్ చాలా బాగా చేశాడు అని చెప్పటం జరిగింది. అలా వివాదాల మద్య విడుదల అయిన ‘అత్తారింటికి దారేది’ సినిమా బాక్సాఫీస్ కు దారేది అంటూ పరుగులు పెట్టింది. అక్కడా విజయం సాధించి తనకంటూ ఒక రికార్డు క్రియేట్ చేసుకుంది.

సింపుల్ గా చెప్పాలంటే మంచితనంకు చావు లేదు అని ‘అత్తారింటికి దారేది’ నిరూపించింది. అంతా కష్టపడి పనిచేశారు. మంచి కధ ఉంది ప్రేక్షకులు ఆశీర్వదించారు. ఈ సినిమాలో పవన్ మ్యానరిజం మరోసారి నిరూపించబడింది. ఆయనకు ఉన్న చరిష్మా సినిమా హిట్ కావటానికి ప్రధాన కారణం. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు సినిమాకు మరో హైలైట్ అని చెప్పాలి. కామెడి, డైలాగులు, సెంటిమెంట్, ఫ్యామిలి ఓరియంటెడ్ స్టోరి అన్ని బాగుండటంతో ‘అత్తారింటికి దారేది’ సూపర్ హిట్ అయింది. ఇక దేవిశ్రీ అందించిన సంగీతం మరో అస్సెట్. సినిమాలో ప్రతి పాట చాలా బాగుంది అనే టాక్ తెచ్చుకుంది. ఇంతటి ఘన విజయం అందుకున్న ‘అత్తారింటికి దారేది’ టీంకు మరోసారి తెలుగు విశేష్ శుభాకాంక్షలు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sharwanand  chiranjeevi  malli malli idi rani roju  latest news  

Other Articles