Prabhudeva in love again

prabhudeva, prabhudeva marriage, prabhudeva love, prabhudeva new lover, prabhudeva new marriage, prabhudeva divorce, prabhudeva first wife, prabhudeva wiki, prabhudeva family, bollywood, tollywood, directors, dancers, women dance masters, indian famous dance masters, prabhudeva love with dance master, latest news, nayanatara prabhudeva, nayanatara prabhudeva love, nayanatara prabhudeva affair, nayanatara prabhudeva break up, nayanatara hot, nayanatara wiki, nayanatara movies

actor cum director prabhu deva to marry soon now he is in love with a dancer : prabhudeva again in love now he is in deep with a dancer whose name yet not announced rumors that soon he marry her

ప్రభు మళ్లీ ప్రేమలో పడ్డాడట..

Posted: 09/24/2014 06:11 PM IST
Prabhudeva in love again

యాక్టర్ కమ్ డాన్సర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా మళ్లీ ప్రేమలో పడ్డాడండి. మనిషన్నాక బ్రతకాలి అన్నట్లుగా.. ప్రభు అంటే ప్రేమించాలి అన్నట్లుగా మనవాడు యవ్యారం మళ్లీ మొదలుపెట్టాడు. ఇక వివరాలను చూస్తే., ప్రస్తుతం నటన, డాన్స్ కాసేపు పక్కనబెట్టి.., డైరెక్షన్ డిపార్ట్ మెంటుపై పడ్డ ప్రభు.., తెగ సినిమాలు తీస్తున్నాడు. అదేమోగాని అవి హిట్టవుతున్నాయి. డైరెక్టర్ గా బిజీగా ఉండటంతో పాటు.., లవర్ బాయ్ లా మారిపోయాడు. ఓ డాన్స్ మాస్టర్ తో ప్రేమ నృత్యం చేస్తున్నాడట. ఆమెతో కలిసి అక్కడా.., ఇక్కడా తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇద్దరూ కలిసి పబ్బులు, ఫంక్షన్లు, పార్టీలకు వెళ్తున్నారు అని సన్నిహితులు అంటున్నారు. అయితే వుడ్ బీ ఆఫ్ ప్రభు ఎవరో మాత్రం ఇంకా బయటకు చెప్పటం లేదు. ముంబైకి చెందిన ఓ డాన్సర్ అంటున్నారు అంతే. అప్పట్లో నయనతో లవ్ బ్రేక్ అయ్యాక.., ‘తనకు ఆడవారు అంటే నచ్చట్లేదు’ అంటూ కామెంట్ చేశాడు. మరి ఏం జరిగిందో ఇప్పుడు తెలియదు కాని.., మళ్ళీ ప్రేమించుకుందాంరా అనటంతో డాన్సర్ ఓకే అందట ఇప్పుడు పెళ్ళి చేసుకుందాం అని కూడా చెప్పేశాడట. త్వరలోనే వీరిద్దరి పెళ్లి అని బాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లో ప్రచారం మోత మోగుతోంది.

కొన్నాళ్ళ క్రితం కలువ కళ్ళ భామ నయనతారతో ప్రభు డీప్ లవ్ లో మునిగాడు. అటు నయన కూడా నువ్వు లేకుండా నేను లేను అన్నట్లుగా చేసింది. అప్పటికే డాన్సర్ ఓ ఇంటి వాడు అని తెలిసి కూడా.., తన ఇంట్లోకి వచ్చేందుకు ఓకే చెప్పింది. అటు నయన కోసం భార్య రమాలత్ అనే డాన్సర్ కు విడాకులు ఇచ్చాడు. కాని ఆ తర్వాత ఇద్దరి ప్రేమ పటాపంచెలు అయింది. కనీసం పెళ్లి దాకా వెళ్తుందనుకుంటే మద్యలోనే విడిపోయారు అని విమర్శకులు పలు కామెంట్లు కూడా చేశారు. వెంటనే కళ్ళు తెరుచుకున్న నయన సినిమాలు మళ్లీ సినిమాలు చేసుకుంటోంది. అటు ప్రభు కూడా డైరెక్టర్ అయిపోయాడు.

అంతా బాగానే ఉంది ఆడవారు నచ్చలేదు అన్న దేవా ఇప్పుడు మళ్ళీ ఆడగాలి కోసం పరితపిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు. గతంలో డాన్సర్ రమాలత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నయనతారను ప్రేమించి పెళ్ళి చేసుకోకుండా విడిపోయారు. ఇఫ్పుడు మరో డాన్సర్ ను ప్రేమించి పెళ్లికి సిద్ధం అవుతున్నాడు. చూడాలి.., మరి వీరిద్దరి స్టెప్పులు ఎంతదూరం వెళ్తాయో. కాని ఇద్దరికి అంతా మంచే జరగాలని కోరుకుందాం. తెలుగు విశేష్ ఆల్ ది బెస్ట్ టు అన్ నోన్ డాన్స్ మాస్టర్ అండ్ ఫేమస్ డైరెక్టర్.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : prabhudeva  cinema  latest news  love  

Other Articles