Kona venkat comments on srinu vaitla

kona venkat, kona venkat movies, kona venkat scripts, kona venkat daigogues, kona venkat latest news, kona venkat raviteja movie, srinu vaitla, srinu vaitla latest, srinu vaitla movies, srinu vaitla on kona venkat, srinu vaitla ram gopal varma, latest news, tollywood, aagadu, aagadu movie, aagadu movie latest, aagadu movie download

kona says he didn't given life to srinu vaitla and the same time vaitla also not given life to him : on srinu vaitla birthday his old colleague kona venkat responded about their friendship says they are still in good relationship only

బర్త్ డే వైట్లపై కోన కామెంట్లు

Posted: 09/24/2014 05:53 PM IST
Kona venkat comments on srinu vaitla

డైరెక్టర్ శ్రీనువైట్ల పుట్టిన రోజున ఆయన మాజి ఆస్థాన రచయిత కోన వెంకట్ కామెంట్లు చేశారు. ఇద్దరి మద్య వివాదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంను తోసిపుచ్చారు. ‘లౌక్యం’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన కోన విభేదాలున్నాయి.., కాని వివాదాలు లేవన్నారు. ఇద్దరిదీ పదేళ్ల ప్రయాణమని వివరించారు. కొన్ని విభేదాల వల్ల ఇద్దరం విడిపోయినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం మాత్రం మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. ఇక ఒకరికి మరొకరు లైఫ్ ఇచ్చినట్లు ఇరువర్గాలు కూడా ప్రచారం చేసుకుంటున్నాయి. దీనిపై కూడా కోన మాట్లాడారు.

ఎవరూ ఎవరికి లైఫ్ ఇవ్వలేదన్నారు. ఎవరి కష్టం వారిదే.., ఎవరి ఫలితమూ వారిదే అని చెప్పారు.‘సత్య’ సినిమాతో తాను హిట్ కొడితే.., ‘ఆనందం’ సినిమాతో వైట్ల కెరీర్ టర్న్ అయిందని చెప్పారు. ఇద్దరం కలిసి పది బ్లాక్ బస్టర్ హిట్లు అందించామన్నారు. అయితే విభేదాలున్నంత మాత్రాన సంబంధాలు తెంచుకుని పోలేము అని వెంకన్న స్పష్టం చేశారు. శ్రీనువైట్ల హిట్ సినిమాలకు కోన డైలాగులు కారణంగా టాక్ విన్పిస్తుంది. మాటల్లొ కొత్తదనం తీసుకువచ్చి.., టాలీవుడ్ సినిమాను మాటలను కోన మార్చేశారు.

అయితే సినిమా టైటిల్స్ విషయంలోనే వీరిద్దరికి ప్రధానంగా వివాదం జరిగినట్లు తెలుస్తోంది. టైటిల్స్ పడే సమయంలో... డైరెక్షన్ తో పాటు మాటలు కూడా శ్రీనువైట్ల అని వేసుకోవటంతో... కోనకు ఆవేదన కలిగి వెళ్లిపోయారట. తాజాగా ఆగడు సినిమాకు వైట్ల ముగ్గురు కొత్త రచయితలను తీసుకొచ్చారు. వారు బాగానే రాసినా.. సినిమా కధ సరిగి లేక కొన్నిచోట్ల అవి పేలలేదు. కధ ఎంపికతో పాటు, కోన లేకపోవటం కూడా సినిమాకు మైనస్ గా చెప్పకుంటున్నారు. మరి ఈ కామెంట్లపై బర్త్ డే డైరెక్టర్ వైట్ల ఎలా స్పందిస్తారో చూడాలి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kona venkat  srinu vaitla  tollywood  latest news  

Other Articles