Akhil will be brand ambassador for titan

akkineni akhil, akkineni akhil wiki, akkineni akhil family, akkineni akhil latest, akkineni akhil movies, akkineni nageswar rao, akkineni nagarjuna, nagachaitanya, latest news, titan watch, wrist watches, watch companies, gadgets and widgets, apparels, brand ambassador

akkineni akhil who is comming to enter film industry got offer from titan watches as brand ambassador : titan watch company observed new brand ambassador by akkineni akhil

సినిమాల్లోకి రాకుండానే ఆఫర్ కొట్టేశాడు

Posted: 09/22/2014 11:47 AM IST
Akhil will be brand ambassador for titan

సినిమాల్లోకి రావటం అంటే అంత ఆషామాషి కాదు. అయితే పలుకుబడి, పరిచయాలు ఉంటే ఇదేమి పెద్ద విషయం కాదు. అక్కినేని నట వారసుడుగా త్వరలోనే అఖిల్ సినిమాల్లోకి వస్తున్నాడు. ఈ విషయం స్వయంగా అఖిల్ ప్రకటించాడు. సినిమా ప్రముఖులకు ఉండే మరో ప్రధాన ఆదాయమార్గం యాడ్ లు. అదేనండి ప్రకటనలు. పలు కంపనీల తరపున బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించి వారి వ్యాపారం పెంచేందుకు సహకరిస్తారు. అయితే ఈ చాన్స్ రావాలన్నా కూడా అంత సులువు కాదు. ఎన్నో హిట్లు కొట్టి.. ఫేమస్ అయితే తప్ప వ్యాపార సంస్థలు వారిపై డబ్బును పెట్టేందుకుఇష్టపడవు.

కాని అక్కినేని అఖిల్ విషయంలో అలా జరలేదు. సినిమాల్లోకి రాకముందే మనవాడు అంబాసిడర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రముఖ గడియారాల తయారి సంస్థ ‘టైటాన్’ అఖిల్ ను బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకుందని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే కంపనీ వాచిలకు సంబంధించి పలు యాడ్ల షూటింగ్ కూడా పూర్తయిందనీ.. ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోందని సన్నిహితులు చెప్తున్నారు. త్వరలోనే ఈ యాడ్ టీవీల్లో టెలికాస్ట్ అవుతుందని అంటున్నారు. అంటే సినిమాల కంటే ముందు టీవీల్లో వస్తున్నాడన్నమాట.

ఇప్పటివరకు అమీర్ ఖాన్, ఖత్రినా ఖైఫ్ మాత్రమే టైటాన్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. తాజాగా అఖిల్ రావటంతో సౌత్ నుంచి ఈ ఆఫర్ కొట్టేసిన నటుడుగా చెప్పవచ్చు. అటు టాలీవుడ్ లో మహేష్ బాబు ఎక్కువ యాడ్లు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఎక్కువ కంపనీల బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న టాలీవుడ్ నటుడుగా ప్రిన్స్ పేరు ఇప్పటివరకు రికార్డుగా ఉంది. దీనిలో ఇప్పటివరకు ఎవరూ పోటి కూడా పడలేదు. తాజాగా సినిమాల్లోకి రాకుండానే అఖిల్ కు ఆఫర్లు వస్తుండటంతో.., ఇక పోటి తప్పదేమో అన్పిస్తోంది. ఏదేమైనా అఖిల్ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుందాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni akhil  titan watches  tollywood  latest news  

Other Articles