Dhansika to act in four characters

dhansika, dhansika movies, dhansika latest, dhansika hot, dhansika hot photos, latest news, bollywood, koliwood, tollywood, multi starrer movies

heroine dhansika to act in four getups in kitna movie : paradesi movie actress dhansika to act in four getups in her kitna movie

ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు

Posted: 09/22/2014 11:12 AM IST
Dhansika to act in four characters

ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అనే సామెత అందరికి తెలుసు. కాని ధన్సిక ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు అంటోంది. మనం మాట్లాడుకుంటోంది ప్రస్తుతం ఆమె చేస్తున్న ‘కిట్నా’ సినిమా గురించి. ఈ మూవీలో అమ్మడు ఏకంగా నాలుగు గెటప్పులు వేస్తోంది. ఇప్పటివరకున్న సినిమాల్లో హీరోలు ఎక్కువ గెటప్పులు వేయటం మనం చేశాము. కాని హీరోయిన్లు కూడా అందుకు తక్కువేం కాదన్నట్లుగా పాత్రల్లో దూరిపోయేందుకు సిద్ధమవుతోంది. తమిళంలో తీస్తున్న ‘కిట్నా’ సినిమా కన్నడ, తెలుగు బాషల్లో కూడా వేరే పేర్లతో విడుదల కానుంది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు.

ప్రస్తుతం చాలావరకు రెండు, మూడు బాషల్లో విడుదల అవుతున్న సినిమాలే చేస్తున్నట్లు చెప్తోంది. ‘పరదేశి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అమ్మడు.. మళ్ళీ చాలాకాలం తర్వాత హీరోయిన్ గా తెలుగు తెరపై మెరవనుంది. అయితే నాలుగు పాత్రలపై మాత్రం ఎక్కువగా సమాచారం ఇవ్వటంలేదు. పాత్రలు ఎలా ఉంటాయి.. సినిమా కధ ఏమిటి వంటి విషయాలు డైరెక్ట్ గా చూడాల్సిందే అని అంటోంది. అయితే షూటింగ్ ప్రారంభం అయితే అన్ని అవే బయటకు వస్తాయని కోలివుడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఇక ధన్సిక హాలీవుడ్ ప్రేక్షకులకు కూడా తన అందాలను చూపించేందుకు తహతహలాడుతోంది. ఓ హాలీవుడ్ సినిమాలో ఈ తమిళ ముద్దుగుమ్మను తీసుకునేందుకు రెడి అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. దాదాపు ఓకే అయినట్లే అని అంటున్నారు. మరి చివరి వరకు చెప్పలేము ఏం జరుగుతుందో. సో అలా ఒకే సినిమాలోనాలుగు పాత్రల్లో నటిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోందీ గుమ్మ.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dhansika  kitna  koliwood  latest news  

Other Articles