Ram gopal varma criticizes aagadu movie

ram gopal varma, ram gopal varma comments, ram gopal varma wiki, ram gopal varma movies, ram gopal varma latest news, ram gopal varma cases, ram gopal varma comments on aagadu, ram gopal varma funny, aagadu, aagadu movie, aagadu latest, aagadu movie review, aagadu review, aagadu talk, aagadu movie watch online, aagadu movie free download, aagadu movie rating, mahesh babu aagadu review, latest news, tollywood news, tollywood, twitter, facebook, social media

director ram gopal varma criticizes mahesh babu's aagadu movie says no change in his last recent movies : aagadu is looks like maheshbabu's old recent movies if any doubt once mahesh may watch his movies and can check says ram gopal varma

‘‘ఆగడు’’ను ఉతికి ఆరేసిన వర్మ

Posted: 09/19/2014 04:58 PM IST
Ram gopal varma criticizes aagadu movie

రాంగోపాల్ వర్మ కామెంట్లు చేస్తే అది సంచలనమే అని అందరికి తెలుసు. ఎవరు ఏ మనుకుంటారు అని పట్టించుకోకుండా మనసులో ఉన్నది నిర్మొహమాటంగా బయటకు చెప్పేయగల సత్తా వర్మకు ఉంది. ఈ మద్య సినిమాలు చూసి వాటి రివ్యూలను ఒక్క ముక్కలో చెప్పేయటం నేర్చుకున్నాడు. ట్విట్టరన్న పున్నెమా అని.., వెంటనే కామెంట్లు కూడా వచ్చిపడుతున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే.., తాజాగా శుక్రవారం రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా ‘ఆగడు’పై వర్మ కామెంట్లు చేశాడు. మామూలుగా చేస్తే వర్మ అవుతాడు కాని రాం గోపాల్ వర్మ ఎందుకు అవుతాడు. అందుకే తనదైన స్టైల్ లో ట్విట్టర్ లో చురకలు అంటించాడు.

పాత సినిమలు చూస్కో మహేష్

‘ఆగడు’ సినిమా చూసిన వెంటనే ట్విట్టర్ అకౌంట్ లో ఆన్ లైన్లోకి వచ్చిన రాం గోపాల్ వర్మ.., తన మనస్సులో ఉన్న అసంతృప్తినంతా బయట పెట్టాడు. వర్మ ఏమన్నాడంటే.. ‘‘ ఇప్పుడే ఆగడు సినిమా చూశాను.. ఇక దూకుడు, బిజినెస్ మెన్ సినిమాలతో పాటు పోకిరి కూడా  చూస్తాను. మహేష్ కూడా ఇప్పుడు ఇదే చేస్తాడని నేను మనసారా భావిస్తున్నాను’’ అని తొలి కామెంట్ చేశాడు. అంటే ‘ఆగడు’ సినిమా గత సినిమాలతో పోలిస్తే పెద్ద తేడా ఏమి లేదని ఆయన చెప్పటం జరిగింది. అందుకోసమే ఆ సినిమాల్లో ఉన్నదేంటో మహేష్ చూసుకుంటాడు అని వర్మ కామెంట్ చేశాడు.

మగధీరతో నీకూ పోలిక

ఇక సినిమాను తిట్టేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బిగ్ హిట్ ‘మగధీర’ను కూడా తీసుకుని పోలికలను చూపించాడు ‘‘ ఆగడు సినిమా డెబ్బయి ఐదు కోట్లు పెట్టి తీశారని.., కాని ఇదే సమయంలో మగధీరను చూస్తే 750 కోట్లు పెట్టి తీసినట్లు ఉంటుందని చెప్పాడు. ఈ సందర్బంలో మగధీర అంత డబ్బు ఖర్చుపెట్టి తీయకపోయినా..,  ఆ స్థాయిలో ఉండటంతో పాటు.., కలెక్షన్ల పరంగా కూడా రికార్డు సృష్టిందని వర్మ అభిప్రాయం.

ఇక ఈ పోలికనే మరింత వివరిస్తూ మరో కామెంట్ చేశాడు. తాను మగధీర సినిమాతో ఎందుకు పోల్చాడో ఈ కామెంట్లో మూడు ముక్కల్లో చెప్పాడు. ‘‘ మగధీర, ఆగడు రెండు సినిమాలు ఇద్దరు హీరోలకు భారీ బడ్జెట్ సినిమాలని చెప్పాడు. అయితే మగధీర రామ్ చరణ్ కు భారీ హిట్ ఇస్తే.., ఆగడు మాత్రం మహేష్ అంచనాలను అందుకోలేకపోయిందని విమర్శించాడు.

మొత్తంగా మహేష్ ‘ఆగడు’ సినిమా బాగాలేదని రాంగోపాల్ వర్మ కామెంట్లు చేశాడు. ఇక ఈ కామెంట్ల కింద ఆయనకు పడ్డ తిట్లు చూడాలంటే.. మనకున్న టైం సరిపోదు. అన్ని కలగలిపి ఒక్కముక్కలో చెప్పాలంటే ‘ముందు ఇళ్లు చక్కబెట్టుకుని అవతలి వారి గురించి మాట్లాడు’’ అని ట్విట్టర్లో కామెంట్లు పడ్డాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : aagadu  ram gopal varma  mahesh babu  latest news  

Other Articles