పవర్ స్టార్ మంచితనం గురించి తెలియనిది ఎవరికి చెప్పండి. మంచి నటుడుగానే కాకుండా.., మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా పవన్ పేరు తెచ్చుకున్నాడు. తోటి వారిని ఎంకరేజ్ చేయటంలో పవన్ ముందుంటాడని అందరికి తెలుసు. ఇప్పుడు ఆపదలో ఉన్న విక్టరీ వెంకటేష్ ను పవన్ కళ్యాణ్ కాపాడుతున్నాడు. అది కూడా ఎలాంటి సంబంధం లేని ఓ మహిళ కోరినందుకు. అయితే ఇదంతా కేవలం సినిమాలో..,. వీరిద్దరి కాంబినేషన్లో త్వరలో వస్తున్న ‘‘గోపాల గోపాల’’ అనే సినిమా కధ ఇది. ప్రస్తుతం రామోజి ఫిలిం సిటిలో సినిమా షూటింగ్ జరుగుతోంది.
కధను ఓ సారి చూస్తే..,
ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో పవన్ శ్రీకృష్ణుడుగా నటిస్తున్నాడు. పవన్ (శ్రీకృష్ణుడు)కి శ్రియా భక్తురాలు. అలాంటి భక్తురాలికి ఒక సమయంలో అనుకోని ఆపద వచ్చింది. అదేమంటే ఆమె భర్త (వెంకటేష్) కష్టాల్లో ఇరుక్కుంటాడు. ఎంత ప్రయత్నించినా వాటిని అధిగమించలేక ఇబ్బందులు పడుతుంటాడు. ఈ సమయంలో భర్తకు సాయం చేయాలని శ్రియా శృకృష్ణుడిని వేడుకుంటుంది. భక్తురాలి కోరికను మన్నించి.., ఆమె ముందు పవన్ ప్రత్యక్షమై.. తాను కాపాడుతానని భరోసా ఇస్తాడు. ఇక పవన్ ఎలా వెంకటేష్ ను కాపాడుతాడు అనేది పూర్తి కధ.
హిందీలో వచ్చిన ‘ఓ మై గాడ్’ ఆధారంగా ఈ సినిమా ను తీస్తున్నారు. పవన్ ‘‘అత్తారింటికి దారేది’’, వెంకటేష్ ‘‘దృశ్యం’’ సినిమాలు ఘన విజయం సాధించాయి. అలాంటిది ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. వచ్చే ఏడాది ప్రారంభ పండగ అంటే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇద్దరు గోపాలుడులు కలిస్తే.., గోకులంలో ఏం జరుగుతుందో చూడాలంటే మరో నాలుగు నెలలు ఆగాల్సిందే.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more