Priyanka chopra about mary kom movie

priyanka chopra, priyanka chopra latest news, priyanka chopra mary kom movie, marykom movie news, priyanka chopra promotional

priyanka chopra about mary kom movie

బాధను మింగేసి.. అలాగే చేసిందట ప్రియాంక!

Posted: 09/04/2014 06:41 PM IST
Priyanka chopra about mary kom movie

(Image source from: priyanka chopra about mary kom movie)

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన తాజా ఇంటర్య్వూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. తన వ్యక్తిగత జీవితంలో తాను అనుభవించిన బాధలు, కష్టాల గురించి వివరిస్తూనే... సినిమాల గురించి చెప్పింది. ప్రస్తుతం ప్రియాంక నటించిన తాజా చిత్రం ‘‘మేరీ కోమ్’’. ఈ చిత్రం కోసం ప్రియాంక తన బాడీని చాలా ఫిట్ గా మార్చేసుకుని.. ఒక బాక్సర్ లా తయారయ్యింది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ కు అనూహ్య స్పందన లభించింది. దాంతో ఈ సినిమాపై ప్రియాంక ఎన్నో ఆశలు పెట్టుకుంది.

మేరీకోమ్ సినిమాకోసం తాను ఎన్నో బాధలు అనుభవించానని.. రాత్రింబవళ్లు కష్టపడి తన బాడీని పెంచుకున్నానని.. తన పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు శాయశక్తులా పనిచేశానని ప్రియాంక పేర్కొంటోంది. దీంతో ఈ సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ విజయం సాధించాలని.. అలాకాని పక్షంలో తన హృదయం గాయపడుతుందని చెబుతోంది. అంతేకాదు.. తన నాన్న చనిపోయిన నాలుగు రోజుల తర్వాత నుంచే ఈ మూవీ షూటంగ్ లో పాల్గొన్నానని తెలిపింది. తన నాన్న చనిపోయినప్పుడు ఎంతో బాధగా వున్నప్పటికీ.. ఆ బాధను మింగేసి షూటింగ్ పాల్గొన్నానని తెలిపింది. ఆ బాధలో ఈ చిత్రంలో సరిగ్గా నటించలేనోమోనన్న భయంతో కొన్ని అమ్మదగ్గర కూడా ఏడ్చేదాన్నని పేర్కొంది. అంటే.. ఈ సినిమా తనకు ఎంత ప్రత్యేకమో ప్రియాంక వివరిస్తోంది.

ఒలంపిక్ విజేత మేరీకోమ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించిందని.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడదని తాను ఆశిస్తున్నట్టు కోరుకుంది. సంజయ్ లీలా భన్సారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 5వ తేదీన ఈ మూవీ విడుదలకానున్న సందర్భంలో ప్రమోషన్ లో భాగంగా ప్రియంకా ఇలా పేర్కొంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : priyanka chopra  mary kom movie  boxer mary kom  sanjay leela bhansali  

Other Articles