Porn video played in desi kattey movie audio function mumbai

desi kattey movie, desi kattey movie audio function, desi kattey movie audio launch, bollywood movie desi kattey, porn video audio launch, desi kattey porn video

porn video played in desi kattey movie audio function mumbai

ఆడియో పంక్షన్ లో ‘‘బూతు’’ సినిమా!

Posted: 09/04/2014 05:51 PM IST
Porn video played in desi kattey movie audio function mumbai

(Image source from: porn video played in desi kattey movie audio function mumbai)

ఇన్నాళ్లవరకు బూతుమాటలే అనుకున్నాం... ఇప్పుడు ఏకంగా బూతు సినిమాలే ప్రత్యక్షమవుతున్నాయి. సినీఫక్కీలో వున్న జనాలు తమతమ సరదాలకోసం బూతుమాటలు ఎక్కువగానే మాట్లాడుకుంటుంటారు. ముఖ్యంగా ఏదైనా ఒక మూవీ ఫంక్షన్ జరుపుతున్నప్పుడు కానీ.. లేదా అవార్డ్ ఫంక్షన్లలోగానీ సెలబ్రిటీలందరూ ఒకేచోట కలుసుకున్నప్పుడు బూతుమాటలను జోకులుగా మార్చేసుకుంటారు. ప్రస్తుతం ఇవి సర్వసాధారణమే అయిపోయాయి కానీ.. ఓ ఆడియో ఫంక్షన్ లో సాక్షాత్తూ బూతు సినిమానే ప్రదర్శించేశారు. దీంతో ఆ ఫంక్షన్ కు విచ్చేసిన ఫ్యామిలీ మెంబర్లు, సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ఇది కావాలనే చేయలేదులెండి.. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఆడియో సాంగ్ రావాల్సింది పోయి బూతు వీడియో వచ్చేసిందని ఆ మూవీ యూనిట్ పేర్కొంది.

బాలీవుడ్ ‘‘దేశీ కట్టే’’ అనే మూడీ ఆడియో ఫంక్షన్ లో జరిగిందీ ఘటన! బుధవారం ముంబైలో ఈ మూవీ ఆడియో ఫంక్షన్ జరిగింది. ఇందుకు బాలీవుడ్ సినీ ప్రముఖులు, ఇతర కుటుంబసభ్యులు అందరూ హాజరయ్యారు. ఇక ఫంక్షన్ స్టార్ అయిన వెంటనే ఆ మూవీకి సంబంధించి మ్యూజిక్ వీడియోలను వరుసగా ప్రదర్శించారు. అయితే ఇంతలోనే వున్నట్లుండి ఓ బూతు వీడియో ప్లే కావడం మొదలయ్యింది. అంతే! అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాకైపోయారు. ఆ బూతు వీడియోను ‘చూసి’ చూడలేక కళ్లు మూసేసుకున్నారు. ఏం చేయాలోనన్న గందరగోళ పరిస్థితి ప్రతిఒక్కరిలో నెలకొంది. ఆ బూతు వీడియోను చూసి షాకైన యూనిట్ సభ్యులు వెంటనే దానిని ఆపేశారు. ఇక, అందరూ ఒకర్నొకరు చూసుకోవడం వంతయ్యింది. అంతా సరదాగా గడుపుతున్న సమయంలో ఈ వీడియోతో అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. మరికొంతమందైతే నోటమాటరాక అలాగే నోళ్లవెళ్లబెట్టి చూస్తూ వుండిపోయారు. ఈ విధంగా ఈ వీడియో ప్లే కావడంతో సదరు మూవీ యూనిట్ సభ్యులు సిగ్గుతో తలదించుకోవలసి వచ్చింది.

ఆనంద్ కుమార్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ సినిమాలో జే భానుషాలి, అఖిల్ కపూర్, శశా అఘా, సునీల్ షెట్టిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ జరుగుతున్నట్లు బాలీవుడ్ లో అంతగా తెలియదు.. కానీ ఆ బూతు వీడియో ప్రదర్శనతో ఇది సంచలనంగా మారిపోయింది. ప్రతిఒక్క న్యూస్ ఛానెల్ లో, వెబ్ సైట్ లో దీని ప్రచారమే కొనసాగించింది. అంటే.. ఈ సినిమాకు బూతు వీడియోతో బాగానే పబ్లిసిటీ వచ్చేసిందని చెప్పుకోవడంలో ఎటువంటి సంశయం లేదు!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : desi kattey movie  audio launch  porn video  bollywood  

Other Articles