Rani mukherjee is ready for skin show liplocks in movies

rani mukherjee is ready for skin show liplocks in movies : bollywood bold actress rani mukherjee is ready for skin show and liplocks in movie. Even if she pregnant then also she would like to act in movie

rani mukherjee is ready for skin show liplocks in movies : bollywood bold actress rani mukherjee is ready for skin show and liplocks in movie. Even if she pregnant then also she would like to act in movie

మూడు ముక్కలాటకు సై అంటున్న రాణిముఖర్జీ!

Posted: 08/23/2014 05:44 PM IST
Rani mukherjee is ready for skin show liplocks in movies

బాలీవుడ్ అగ్రహీరోయిన్లలో ఒకరైన రాణిముఖర్జీ... తాను పెళ్లిచేసుకున్న అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ను ‘‘మర్దానీ’’ సినిమా ద్వారా మొదలుపెట్టిన విషయం తెలిసిందే! ఈ సినిమాలో రాణి ముఖర్జీ పోలీస్ పాత్రలో చాలా ఎనర్జటిక్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. విమర్శకులు సైతం ఈమె నటనకు ముగ్ధులయిపోయి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పైగా సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఫస్ట్ చిత్రంతోనే విజయం సాధించడంతో ఈ అమ్మడి ఆనందాలకు హద్దు లేకుండా పోయింది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తన సంతోషాన్ని పంచుకోవడానికి చక్కర్లు కొడుతోంది.

ఈ నేపథ్యంలోనే రాణి ఒక ఇంటర్య్యూలో భాగంగా మాట్లాడుతూ కుండబద్ధలు కొట్టేసింది. పెళ్లయినంత మాత్రాన సినిమా కెరీర్ కు వదులుకోనని ప్రకటించిన రాణిముఖర్జీ.. మూడుముక్కలాట ఆడటానికైనా సై అంటూ తెగేసి చెబుతోంది. సాధారణంగా మన ఇండియన్ చిత్రపరిశ్రమలో హీరోయిన్లు పెళ్లియినా తరువాత చాలావరకు సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారు. కానీ తాను మాత్రం అలా చేయనని... దర్శకుడు ఓకే అంటే తాను గర్భంతోనైనా షూటింగ్ కు వస్తానని చెబుతోంది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. ‘‘హాలీవుడ్ లో అయితే హీరోయిన్లు గర్భంతో వున్న పనిచేస్తారు. మనదేశంలో పెళ్లికాగానే సినిమాలనుంచి దూరమైపోతున్నారు. కానీ నేనలా చేయను. దర్శకుడు ఓకే అంటే నేను గర్భంతో వున్నా నటిస్తా’’ అని ఆమె పేర్కొంది.

ఇక గ్లామర్ విషయంలోనూ తాను నటించడానికి సిద్ధమని రాణి స్పష్టం చేస్తోంది. పెళ్లయిన కొందరు హీరోయిన్లు సినిమాల్లో సన్నిహిత దృశ్యాలకు, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించేందుకు ఇబ్బంది పడుతుంటారు. కానీ తానకు మాత్రం అటువంటి సన్నివేశాల్లో ఎటువంటి అభ్యంతరం లేదని తెగేసి చెప్పింది. ఇందులో తన భర్త కూడా తనకు అన్ని విధాలుగా సహకరిస్తాడనిన.. నా వ్యక్తిగత - సినిమా వ్యవహారాల్లో అతను జోక్యం చేసుకోడని విశ్లేషించింది. లిప్ లాక్ సన్నీవేశాలు, స్కిన్ షోలు, గ్లామర్ పాత్రలకు నేను కూడా రెఢీ. ఒకవేళ నేను గర్భవతినైతే దర్శకుడు ఒప్పుకుంటే గర్భంతో నటించడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ చెప్పి అందరికి షాకిచ్చింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rani mukherjee  aditya chopra  bollywood actresses  

Other Articles