Girls below 18 from acting dismissed

below 18 girls become an heroines, PIL to prohibit girls below 18 from acting in films dismissed, PIL to prohibit, girls below 18 from acting in films, dismissed, PIL to prohibit girls below 18 from acting, girls below 18 from acting in films

The Madras High Court today dismissed a PIL seeking to prohibit girls below 18 years of age to act as heroine and other adult characters...

యువ భామల జోలికి రామంటున్న కోర్టు

Posted: 08/23/2014 12:21 PM IST
Girls below 18 from acting dismissed

ఈ మధ్య 15 ఏళ్ల కుర్ర భామలందరూ కూడా హీరోయిన్ అయిపోదామని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నారు. అయితే ఇలా చిన్న వయసులోనే ఈ సినిమా ఇండస్ట్రీలోకి రావడం వలన చాలా ఘోరాలు జరుగుతున్నాయి. కొంత మంది ఇలాంటి అమ్మాయిలను వాడుకొని వదిలేస్తున్నారు. సినిమాల్లో హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు ఇప్పిస్తామంటూ ఆ అమ్మాయిలను నగరానికి తీసుకొచ్చి, వారితో లైంగిక కార్యకలాపాలు జరిపి, వారి దగ్గరున్న డబ్బంతా తీసేసుకొని మోసం చేస్తున్నారు.

అయితే ఇలాంటి పరిస్థితి యువ భామలు రాకుడదనే వుద్దేశ్యంతో తమిళనాడు మక్కల్ కట్చి రాష్ట్ర కార్యదర్శి ముత్తుసెల్వి హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేసారు. సినిమాల్లో 18 ఏళ్లు నిండని అమ్మాయిలను హీరోయిన్లుగా నటింపజేస్తున్నారని, ఆ వయసులో అమ్మాయిలకు పరిపక్వత వుండదని, అలాంటి వారు మానసికంగా, శారీరకంగా బాధింపులకు గురవుతారని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. అలాంటి వారే ఎక్కువగా అత్యాచారాలకు, మోసాలకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాబట్టి 18 ఏళ్ల వయసులోపు అమ్మాయిల్ని నాయికలుగా నటించడంపై నిషేధం విధించాలని కోరారు.

అయితే సదరు పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. జీవితంలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో సాధించాలన్న లక్ష్యంతో పయనిస్తారని, ఈ విషయంలో న్యాయస్థానం కల్పించుకోదంటూ పిటిషన్ కొట్టివేసింది. ఈ వార్త హీరోయిన్లు కావాలనుకుంటున్న కుర్ర భామలకు కాస్త సంతోషాన్నిచ్చింది. ఏదేమైనా కూడా ముత్తుసెల్వి వేసిన పిటీషన్ లో కూడా న్యాయముంది. మరి కోర్టు ఆ పిటీషన్ ను కొట్టివేసినప్పటికీ.... హీరోయిన్ గా అవ్వాలనుకుంటున్న యువ భామలు మాత్రం కాస్త జాగ్రత్తగా వుండటం ఎంతైనా మంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madras High Court  heroines  acting in films  girls below 18 years  

Other Articles