Samantha latest katti movie in political troubles

samantha, samantha ruth prabhu, samantha movie, samantha kollywood, samantha kollywood movies, samantha tollywood movies, samantha filmography, samantha hot photo shoot, samantha katti movie, tamil hero vijay, hero vijay katti movie, samantha katti vijay

samantha latest katti movie in political troubles : glamour doll samantha latest starrer movie katti is getting political troubles to not release the movie

రానురానంటూనే రాజకీయ చిక్కుల్లో పడిన సమంత!

Posted: 08/22/2014 03:20 PM IST
Samantha latest katti movie in political troubles

సాధారణంగా సినీరంగంలో వున్న కొంతమంది ప్రముఖ తారలు రాజకీయాల్లో రానురానంటూనే రంగప్రవేశం చేసేస్తారు. తొలుత చిత్రపరిశ్రమలో మంచి పేరు సాధించిన అనంతరం ఎవరూ తెలియకుండా రాజకీయాల్లో అడుగులు వేస్తారు. మొదట్లో రాజకీయాల గురించి మాట్లాడితేనే ఆమడదూరంలో వుండే సినీ ప్రముఖులందరూ... తర్వాత రానురాను ఏదో ఒక దశలో ఖచ్చితంగా అడుగులు వేయక తప్పదు. ఇలా బాలీవుడ్ తోపాటు మన సౌత్ ఇండస్ట్రీలో వున్న ప్రముఖ నటీనటులందరూ ముందుగా రాజకీయాలంటే గిట్టదంటూనే ఎంట్రీ ఇచ్చుకున్నవాళ్లు చాలామందే వున్నారు. తాజాగా ఇప్పుడు వీరి జాబితాలోకి కూడా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకే గ్లామర్ డాల్ గా పేరు నమోదు చేసుకున్న సమంతా కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. ఈమేరకు కోలీవుడ్ మీడియాలో కథనాలు షికార్లు చేస్తున్నాయి.

ఆమధ్య ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అయిన ‘‘సమైక్యాంధ్ర పార్టీ’’కి సమంతా మద్దతు పలుకుతున్నట్టు కొన్నాళ్లవరకు మీడియాలో వార్తలు బాగానే వెలువడ్డాయి. సమంతా కూడా ఆ వార్తలను ఖండిస్తున్నట్టు ఏనాడు వ్యాఖ్యానాలు చేయలేదు. సరే.. అదే వేరే విషయం..! ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు ఇటువంటి రాజకీయ సమస్యల్లోనే మరోసారి చిక్కుకుందని కోలీవుడ్ మీడియాలో వార్తకథనాలు బాగానే ప్రచారం అవుతున్నాయి. ఒకవైపు టాలీవుడ్, కోలీవుడ్ లలో దాదాపు అరడజను సినిమాలతో బిజీగా వుంటూనే.. మరోవైపు తీరిక సమయం దొరికినప్పుడల్లా యాడ్ లలో దర్శనమిస్తూ కోట్లకొద్ది డబ్బులను జమ చేసుకున్న ఈ భామకు.. రాజకీయ చిక్కుల్లో పడే అవసరం ఏమొచ్చిందని అనుకుంటున్నారా..? అయితే సమంత రాజకీయ రంగంలో అడుగులు పెట్టలేదు కానీ.. తాను తాజాగా నటించిన సినిమా రాజకీయ నేపథ్యంలో కొనసాగడంతో ఇప్పుడు అది పెద్ద దుమారంగా మారిపోయింది.

కోలీవుడ్ టాప్ హీరో విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘‘కత్తి’’ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే! ఈ సినిమా కథ మొత్తం రాజకీయ నేపథ్యంలో సాగుతున్న తరుణంలో ఇప్పుడు ఇది పెద్ద వివాదానికి దారితీసింది. ఈ సినిమా విడుదలకు అడ్డుకోవాలంటూ  తమిళనాడులోని పురుట్చిభారతం పార్టీ కార్యకర్తలు బుధవారంనాడు ఆందోళనలు నిర్వహించారు. ఎందుకంటే.. ఈ చిత్రాన్ని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే మద్దతుదారులు నిర్మిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని నుంగంబాక్కంలో జరిగిన కార్యక్రమంలో వారు చిత్రం విడుదలను నిలిపివేయకపోతే రాజకీయ ఉద్యమం చేపడతామని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు.. హీరో విజయ్, చిత్ర దర్శకుడు మురుగదాస్ ఇళ్లను కూడా ముట్టడిస్తామని వారు వార్నింగ్ కూడా ఇచ్చారు.

గతంలో ఎల్టీటీఈ చీఫ్ దివంగత ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్ ను శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే మద్దతుదారులు మట్టుపెట్టారని... అటువంటివాళ్లు నిర్మిస్తున్న ‘‘కత్తి’’ సినిమాను విడుదల చేస్తే అది మొత్తం తమిళజాతికే తీవ్రం అన్యాయంగా తాము పరిగణిస్తామని ఉద్యమకారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రాజకీయపరంగా సమస్యలు చుట్టుముట్టుకున్నాయి. సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేయకూడదని.. అలాకానిపక్షంలో తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని వారు గట్టిగా వార్నింగ్ లు జారీ చేస్తున్నారు.

ఇదిలావుండగా... సమంతకు తన సొంత ఇండస్ట్రీలోనే ఇంతవరకు ఒక్క భారీ విజయం కూడా దక్కలేదు. ఇటీవలే ఈమె నటించిన కోలీవుడ్ చిత్రం ‘‘అంజాన్’’ రొటీన్ స్టోరీ అంటూ డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయింది. సక్సెస్ అవుతుందనుకున్న ఆ సినిమా చివరికి ఫ్లాప్ టాక్ తోనే సమంతకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ‘‘కత్తి’’ సినిమాతోనైనా కోలీవుడ్ లో తన ముద్రను వేసుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న సమంతకు ఈసారి రాజకీయపరంగా చిక్కులు ఎదురయ్యాయి. కోలీవుడ్ క్వీన్ గా ఎదుగుదామని సమంతా ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఈమెకు మాత్రం ఏదోవిధంగా దెబ్బమీద దెబ్బ తగులుతూనే వుంది. ఇటువంటి పరిణామాలను చూస్తుంటే.. సమంతకు కోలీవుడ్ కలిసిరాదేమోనంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha ruth prabhu  hero vijay  katti movie  political troubles  samantha movies  

Other Articles