Tollywood megastar chiranjeevi birthday special

chiranjeevi, megastar chiranjeevi, chiranjeevi birthday, chiranjeevi latest news, chiranjeevi nepal tour, chiranjeevi family members, ram charan, chiranjeevi 150 movie, ram charan

tollywood megastar chiranjeevi birthday special : megastar chiranjeevi celebrating his 59 birthday celebrations in nepal with his family members

అభిమానులకు నిరాశ మిగిల్చిన చిరంజీవి బర్త్ డే!

Posted: 08/22/2014 01:37 PM IST
Tollywood megastar chiranjeevi birthday special

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజీని క్రియేట్ చేసుకున్న ఘరానామొగుడు! హీరోగా మూడు దశాబ్దాలవరకు కొనసాగి ఎన్నో టాప్ సినిమాలను తన ఖాతాలో నమోదు చేసుకున్న ఏకైక నటుడు! మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోలలో ఒకరైన చిరంజీవి స్టైలే వేరు! మాస్, కామెడీ, యాక్షన్, విలనిజం.. ఇలా విభిన్న రకాల పాత్రల్లో అద్భుత కళా ప్రదర్శనను కనబరిచిన చిరంజీవి.. శుక్రవారం (22.08.2014) తన 59వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు.

1955లో ఓ మిడిల్ క్లాస్ కుటుంబంలో జన్మించిన చిరంజీవి.. తెలుగు చిత్రపరిశ్రమలో ఒక చిన్న ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చుకున్నారు. తర్వాత ఎన్నో సమస్యలను ఎదుర్కున్న అనంతరం.. హీరోగా అవతారమెత్తారు. అంతే! వచ్చిన ఆ ఒక్క అవకాశంతో తనలో వున్న టాలెంట్ ను నిరూపించుకున్నారు. 80వ దశకంలో ఆయన చేసిన సినిమాల్లో తన డాన్య్, ఫైట్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేసుకున్నారు. అప్పటి నుంచి మొదలైన ఈయన హీరోగిరీతో జనాలను అలరిస్తూ వస్తున్నారు. కేవలం తెలుగులోనే కాదు.. బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించి మన తెలుగు చిత్రపరిశ్రమ గర్వించదగేలా చేశారు. ఈ విధంగా ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవికి 2006లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అలాగే ఆ సంవత్సరంలోనే ఆంధ్ర యూనివర్సీటీ ఈయనకు డాక్టరేట్ బిరుదుతో సత్కరించింది. ఇలా ఈ విధంగా చిరు ఎన్నో అవార్డులు, రివార్డులు చాలానే సొంతం చేసుకున్నారు.

‘‘శంకర్ దాదా జిందాబాద్’’ చిత్రం అనంతరం చిరంజీవ సినిమాల నుంచి రాజకీయరంగంలో అడుగులు వేశారు. అక్కడ కూడా ఆయన ఎన్నోరకాల సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయినా వాటిని ఎదుర్కొంటూ ఆయన ముందడుగులు వేశారు. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. టూరిజమంత్రిగా పదవి సాధించారు. అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలం కావడంతో ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ విషయాలన్ని అటుంచితే.. చిరంజీవి ఇప్పటివరకు 149 సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఆయన 150 చిత్రంలో నటిస్తున్నట్టు వస్తున్న వార్తలపై అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో చిరు 150 సినిమాకు సంబంధించి ఎన్నోరకాల వదంతులు వచ్చాయి. అయితే చిరు మాత్రం వాటన్నింటిని ఖండిస్తూ వచ్చారు. అయితే అభిమానుల కోరిక మేరకు ఆయన ఎట్టకేలకు మళ్లీ సినిమాలో అరంగేట్రం చేయడానికి సిద్ధం అయ్యారు.

అందులో భాగంగానే చిరంజీవి తాజాగా తనకు సంబంధించిన ఒక ఫోటోషూట్ ను రిలీజ్ చేశారు కూడా! అవి విడుదల అవ్వడం ఆలస్యం... నెటిజన్లు, అభిమానుల నుంచి వినూత్ర రెస్పాన్స్ లభిస్తోంది. 60వ ఏటకు దగ్గరపడుతున్నా.. చిరు మాత్రం యంగ్ అండ్ డాషింగ్ యంగ్ బాయ్ లా కనిపిస్తున్నాడంటూ సినీ ప్రముఖులు సైతం ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చిరు తన బర్త్ డే సందర్భంగా 150వ సినిమాకు సంబంధించిన విశేషాలను బహిర్గతం చేయనున్నారు. దీంతో ఆయన ఈ విషయాలను ఎప్పుడు వెల్లడిస్తాడా అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కామెడీ విత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న చిరు... ఈ సినిమాను తనయుడు రామ్ చరణ్ నిర్మించనున్నాడు. దీంతో అభిమానులందరూ ఇక పండగ చేసుకుంటున్నారు. తన అభిమాన నటుడి సినిమా త్వరలోనే రాబోతోందని అందరూ సంబరపడిపోతున్నారు.

ఇదిలావుండగా... చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు నిరాశే మిగిల్చారని తెలుస్తోంది. ఎందుకంటే.. ఆయన తన పుట్టినరోజు హైదరాబాద్ లోని అభిమానుల మధ్య కాకుండా.. నేపాల్ లో జరుపుకుంటున్నట్టు తాజా వార్తలసారాంశం. ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ఖాట్మాండులోని పశుపతి నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి అన్ని కార్యక్రమాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ అభిమాన నటుడు హైదరాబాద్ లో జన్మదిన వేడుకలు జరుపుకోవడం లేదంటూ అందరూ నిరుత్సాహానికి గురయ్యారు. అయితే చిరు తనయుడు రామ్ చరణ్ తన తండ్రి వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించి.. అభిమానులను సంబరపరుస్తున్నట్లు స్వయంగా ఆయనే పేర్కొన్నాడు. చిరు హైదరాబాద్ లో వుండరు కాబట్టి... ఆయన తరఫున రామ్ చరణ్ ఆ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించనున్నట్టు సమాచారం! ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రామ్ చరణ్ తన తండ్రి చిరు బర్త్ డే సందర్భంగా ఒక ఖరీదైన లాండ్ క్రూజర్ వీఎక్స్ వీ8 కారును ప్రత్యేకంగా కొనుగోలు చేసి కానుకగా అందించాడు. దీని విలువ దాదాపు కోటి 25 లక్షలు.

తెలుగు చిత్రపరిశ్రమలో తిరిగి మళ్లీ అరంగేట్రం చేస్తున్న మన మెగాస్టార్ చిరంజీవికి ‘‘తెలుగు విశేష్’’ తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  ram charan  chiranjeevi 150 movie  chiranjeevi birthday  

Other Articles