Aagadu audio release date confirmed

aagadu movie, aagadu audio release date. mahesh babu movies, super star mahesh babu, mahesh latest movies, tollywood news, telugu movie gossips

aagadu audio release date is august 28 and the venue may be shilpa kala vedika : mahesh babu's aagadu movie audio releasing on 28th august

ఆగడు ఆడియో విడుదలకు ముహూర్తం

Posted: 08/12/2014 01:49 PM IST
Aagadu audio release date confirmed

ఆగడు ఆడియో విడుదల సస్పెన్స్ కు ఇక తెరపడనట్లే. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ కొత్త చిత్రం ఆడియో విడుదల తేదిని చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఈ నెలాఖర్లోనే పాటలను విడుదల చేస్తామని ప్రకటించాయి. అన్ని కుదిరితే ఆగస్టు 28న ఎవరు ఆపినా ఆగకుండా ఆడియో విడుదల చే్స్తామని సినిమా యూనిట్ చెప్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నాయట. కార్యక్రమాన్ని శిల్ప కళా వేదికలో నిర్వహిస్తారని కూడా ఫిలింనగర్ నుంచి వార్తలు వస్తున్నాయి. ఇంకేముంది ప్రిన్స్ పాటల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చవితికి ఒకరోజు ముందునే పండగను తెచ్చేలా పాటలను అందిస్తున్నారు.

ప్రిన్స్ మహేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటి తమన్నా కధానాయిక. కలువ కళ్ళ శ్రుతి హాసన్ ఇందులో ఐటమ్ సాంగ్ లో మెరిసి అభిమానులను అలరించనుంది. ఎంటర్ టైన్ మెంట్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో విడుదలకు ముందే హిట్ టాక్ వచ్చేసింది. పెప్పి ఆల్బమ్ తో తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. 14 రీల్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దూకుడు సినిమాను ఈ సంస్థే నిర్మించటం విశేషం.

ఇక సినిమా విషయానికొస్తే, ఇందులో మహేష్ పోలిస్ క్యారెక్టర్ లో యాక్షన్ హీరోగా అదరగొట్టాడని తెలుస్తోంది. శంకర్ గా పిలవపడే ఈ పోలిస్ అక్రమాలు, అన్యాయాలను ఎలా అరికటడతాడో వెండితెరమీదే చూడాలంటుంది సినిమా యూనిట్. గతంలో దూకుడు తర్వాత మళ్ళీ మహేష్ ఓ పోలిస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో కన్పిస్తున్నాడు. ఇప్పటికే పోకిరి, దూకుడు సినిమాల్లో పోలిస్ క్యారెక్టర్లను చూసిన ప్రేక్షకులు ఆగడును కూడా ఆదరిస్తారా లేక రొటీన్ గా ఫీల్ అవుతారా అనేది చూడాలి. ఆల్ ది బెస్ట్ ప్రిన్స్.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aagadu movie  super star mahesh babu  aagadu audio  

Other Articles